మొత్తానికి కౌశల్ కూడా హీరో అయ్యాడు…

February 28, 2020 at 3:39 pm

మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి సినిమాలు, సీరియల్స్‌లో నటుడుగా చేస్తూ వచ్చిన కౌశల్…బిగ్ బాస్-2 షో ద్వారా బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కౌశల్.. విజేతగా అవతరించి సంచలనం సృష్టించాడు. దీంతో ఒక్కసారిగా కౌశల్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. హీరోలకు ధీటుగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవడంలో కౌశల్ పూర్తిగా విఫలం అయ్యాడు.

బిగ్ బాస్ షో తర్వాత పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. కాకపోతే బిగ్ బాస్ షో అవ్వడమే తనకు హీరోలుగా అవకాశాలు వచ్చేస్తున్నాయని, త్వరలోనే తన సినిమాలు రాబోతున్నాయంటూ కౌశల్ హడావిడి బాగానే చేశారు. ఫ్యాన్స్, ఆర్మీలు ఉంటూ కొన్ని రోజులు ఆ గోలలో బ్రతికేశారు. అయితే నిదానంగా కౌశల్ క్రేజ్ పడిపోతూ వచ్చింది.

ఇలా క్రేజ్ పడిపోతున్న క్రమంలోనే కౌశల్ హీరోగా సినిమా చేయబోతున్నాడు. సుమారు రెండేళ్ల నిరీక్షణ తరువాత సినిమా మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేస్తూ తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఫొటోలను ఎమోషనల్ పోస్ట్‌తో జతచేసి వదిలాడు. ఈ నూతన మూవీ ప్రారంభోత్సవానికి ప్రముఖ నటుడు ఆది సాయికుమార్ హాజరయ్యారు. దర్శకుడు కృష్ణ..కౌశల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

మొత్తానికి కౌశల్ కూడా హీరో అయ్యాడు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts