నారప్పకు నానా కష్టాలు …!

February 22, 2020 at 9:30 am

టాలీవుడ్‌ అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న విక్టరీ వెంకటేష్…ఓ వైపు కుర్ర హీరోలతో మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు సోలో హీరోగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. వెంకీ గత ఏడాది వరుణ్ తేజ్‌తో కలిసి ‘ఎఫ్2, నాగ చైతన్యతో ‘వెంకీమామ’ చిత్రాల్లో కలిసి నటించాడు. ఇక ప్రస్తుతం తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన ధనుష్ చిత్రం ‘అసురన్’ రీమేక్‌లో నటిస్తున్నాడు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఒరిజినల్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేదుకు వెంకీ, బాగా కష్టపడుతున్నాడట. ముఖ్యంగా ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ధనుష్‌ నటనకు ఏ మాత్రం తగ్గకుండా వెంకీ బాగా ప్రిపేర్ అవుతున్నాడట. అవసరమైతే ఒకో సీన్ కోసం ఎన్ని టేక్స్ అయిన తీసుకుని పర్ఫెక్ట్‌గా వచ్చేవరకు చేస్తున్నాడట. సినిమాకే హైలైట్‌గా ఉండే ఇంటర్వెల్ ఫైట్ సీన్ కోసం వెంకీ 10 రోజులు తీసుకున్నాడట. కాగా, ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రఫర్‌గా పీటర్ హెయిన్స్ పనిచేస్తున్నాడు. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

నారప్పకు నానా కష్టాలు …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts