విజ‌య్ కోరిక‌ను ఎన్టీఆర్ మ‌న్నిస్తాడా…!

February 19, 2020 at 6:02 pm

ఇప్పుడు సినిమాలో ఇగో స‌మ‌స్య‌కు చెక్ పెడుతున్నారు టాప్ హీరోలు.. వీరిని అనుక‌రిస్తూ.. ముందుకు సాగుతున్నారు న‌వ‌త‌రం యువ‌హీరోలు.. టాప్ హీరోలను త‌మ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం.. చిత్రంలో అతిధి పాత్ర‌ల్లో న‌టించేలా ఒప్పించుకుంటున్నారు. వీటికి తోడు త‌న చిత్రంలో వారి వాయిస్ ఓవ‌ర్ ఇప్పించుకోవడం.. చిత్ర వేడుక‌ల‌కు ముఖ్య అతిధులుగా పిలుచుకోవ‌డం, క‌లిసి ఇత‌ర సినిమా వేడుక‌ల‌కు అతిధులుగా వెళ్ళ‌డం చేస్తున్నారు. ఇలా టాప్ హీరోల‌ను త‌న సినిమాల కోసం వాడుకుంటున్న న‌వ‌త‌రం యువ హీరోలు ఇప్పుడు ఏకంగా త‌న చిత్రంలో పాట‌లు పాడించుకుంటున్నారు.

టాప్ హీరోలు త‌మ చిత్రాలల్లో పాట‌లు పాడుతూ త‌న అభిమానుల‌ను ఉత్సాహ ప‌రుస్తున్నారు. సినిమాకు కూడా భారీ హైప్‌ను తెస్తున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి మొదలు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు అంద‌రు త‌మ చిత్రాల్లో పాట‌లు పాడుకుంటున్నారు. నిన్న‌టి నిన్న సరిలేరూ నీకెవ్వ‌రూ చిత్రంలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు కూడా పాటలో మాట‌లు వినిపించి సినిమాకు ఓ ఊపు తెచ్చాడు. అయితే ఇప్పుడు త‌మిళ‌హీరో విజ‌య్ ఏకంగా ఓ టాప్ హీరోతో త‌న సినిమాలో పాట పాడించుకోవ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తున్న వార్త‌.

త‌మిళ‌ హీరో విజ‌య్ న‌టిస్తున్న చిత్రం మాస్ట‌ర్. ఈ సినిమాలో ఓ టాప్ హీరో పాట పాడేందుకు సిద్ద‌మైన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కు హీరో విజ‌య్ ఏ హీరోతో పాట పాడించుకుంటున్నాడో తెలిస్తే అంతా షాక్ కావాల్సిందే. టాలీవుడ్ టాప్ హీరో నంద‌మూరి తార‌క‌రామా రావు ఉర‌ప్ జూనియ‌ర్ ఎన్టీఆర్ చేత పాట పాడించేందుకు విజ‌య్ స్వ‌యంగా ఎన్టీఆర్‌ను క‌లిసి మాట్లాడార‌ని టాక్‌. మాస్ట‌ర్ సినిమాలో కుట్టి స్టోరీ పాట ఇటీవ‌ల విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పాట త‌మిళ‌నాట ఉర్రూత‌లూగిస్తుంది. అయితే తెలుగులో మాస్ట‌ర్ సినిమాలో ఈ పాట‌నే ఎన్టీఆర్ చేత పాడించాల‌ని విజ‌య్ ఆలోచ‌న‌. ఇది నిజ‌మైతే ఇక విజ‌య్ సినిమాకు తిరుగేలేద‌న్న‌మాట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో ఓ పాట పాడిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు త‌న సినిమాలో కాకుండా.. మ‌రో హీరో సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పాట పాడుతాడా.. విజ‌య్ కోరిక‌ను మ‌న్నిస్తాడా వేచి చూడాల్సిందే.

విజ‌య్ కోరిక‌ను ఎన్టీఆర్ మ‌న్నిస్తాడా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts