బాబుపై విజయసాయి సెటైర్…!

February 17, 2020 at 12:52 pm

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఆయన రోజు మాదిరిగానే, ఈరోజు కూడా బాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శనస్త్రాలు సంధించారు. తన ఆర్థిక వ్యవహారాల పాస్‌వర్డ్‌ చంద్రబాబునాయుడు తన పీఎస్‌ శ్రీనివాస్ వద్ద వదిలేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశారు.

ఇక వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా పీఎస్‌ శ్రీనివాస్తు చేతుల్లో పెట్టేసి ఇప్పుడు బిక్కసచ్చిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంత బతుకు బతికి ఇంటెనక…’ అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి తయారయ్యిందని ఊహించని విమర్శలు చేశారు.

కాగా,ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ శాఖ దాడులపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా విషయం తెలిసిందే. ఇక ఐటీ శాఖ దాడుల్లో రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు దొరికాయని వైసీపీ ఆరోపిస్తుండగా, కాదు వైసీపీ అబద్దాలు ఆడుతుందని, రెండు లక్షలే దొరికాయని టీడీపీ చెబుతోంది.

బాబుపై విజయసాయి సెటైర్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts