వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌ రివ్యూ &రేటింగ్

February 14, 2020 at 1:46 pm

నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, క్యాథెరిన్, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్ తదితరులు
దర్శకత్వం: క్రాంతి మాధవ్
నిర్మాత: కెఏ వల్లభ
మ్యూజిక్: గోపి సుందర్

టాలీవుడ్ రౌడీ అన్న ఇమేజ్ తెచ్చుకున్న యువ‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా, డియ‌ర్ కామ్రేడ్ లాంటి రెండు ప్లాపుల త‌ర్వాత న‌టించిన సినిమా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌. న‌లుగురు హీరోయిన్ల‌తో విజ‌య్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో యూత్‌లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత కేఎస్‌.రామారావు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా అంచ‌నాలు అందుకుందో ? లేదో TJ సమీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
గౌతమ్ (విజయ్ దేవరకొండ) రచయిత కావాలనే తన ప్యాషన్ కారణంగా ఉన్న జాబ్ ను కూడా వదిలేసుకుంటాడు. ఈ క్ర‌మంలోనే తాను కాలేజ్ డేస్ నుంచి ప్రేమించే యామిని (రాశి ఖన్నా)ను విస్మరిస్తుంటాడు. యామిని గౌత‌మ్‌ను వ‌దిలేసి వెళ్లిపోతుంది. ఆమెతో విజ‌య్ బ్రేక‌ప్ అయ్యాక మూడు అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌లు రాస్తాడు. ఈ క‌థ‌లో శీనయ్య, సువర్ణల ఇల్లందులో ప్రేమ కథ, ప్యారిస్ లో గౌతమ్, ఇజాల మధ్య ప్రేమకథల‌కు ఉన్న లింక్ ఏంటి ? గౌత‌మ్ చివ‌ర‌కు ర‌చ‌యిత కావాల‌న్న కోరిక తీర్చుకున్నాడా ? యామినితో గౌతమ్ లవ్ స్టోరీ చివరికి ఏ టర్న్ తీసుకుంది అన్నది మిగతా కథ.

విశ్లేష‌ణ :
విజయ్ దేవరకొండ నటన కంటే భిన్నమైన కథలు చేయాలన్న ఆలోచ‌న మెచ్చుకోవాలి. ఈ సినిమాలో కూడా మూడు భిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో విజ‌య్ న‌టించాడు. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అయినా.. మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించాడు. రైటర్ గా, ఒక యూనియన్ లీడర్ గా, ఒక మ్యుజిషియన్ గా విజయ్ మూడు పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేసాడు. శీన‌య్య రోల్ సూప‌ర్‌. హీరోయిన్ల‌లో రాశీఖ‌న్నా రోల్ బాగున్నా.. ఆమె బాగా డిప్రెష‌న్లోకి వెళ్ల‌డం న‌చ్చ‌దు. ఐశ్వ‌ర్య రాజేష్ మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణిగా చ‌క్క‌గా న‌టించింది. పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన సూపర్బ్. క్యాథెరిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అయితే ఆమెకు దక్కింది పరిమిత పాత్ర మాత్రమే. ఇజబెల్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మిగిలిన వాళ్ళందరూ మామూలే.

టెక్నిక‌ల్‌గా…
టెక్నిక‌ల్‌గా గుమ్మ‌డి జ‌య‌కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ ఇంకా బాగుండొచ్చు అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రేమకథలకు సంగీతం ప్రధానం. ఇక్కడే ఈ సినిమా వెనకడుగు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ఎంచుకున క‌థ ఓకే. క‌థ‌లో భిన్న‌మైన లేయ‌ర్లు ఉంటాయి. ఫ‌స్టాఫ్ బాగున్నా.. సెంక‌డాఫ్‌లో క‌థ, క‌థ‌నాలు తేలిపోయాయి. సెకండాఫ్‌ బాగా డల్ అవుతుంది. ఇక్కడ నరేషన్ పూర్తిగా గాడి తప్పింది. నిర్మాణ విలువులకు ఢోకా లేదు.

ప్ల‌స్‌లు (+):
– విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్
– శీనయ్య, సువర్ణల పెర్ఫార్మన్స్
– ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్
– సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్‌లు (-):
– సోల్ లెస్ స్క్రిప్ట్
– వీక్ సెకండ్ హాఫ్
– స్లో నెరేష‌న్‌

ఫైన‌ల్‌గా…
ఈ మూడు ప్రేమ‌క‌థ‌ల‌కు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కావ‌డం కంటే డిస్‌క‌నెక్ట్ అయ్యే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి. ఫైన‌ల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిలో యావ‌రేజ్ సినిమాగా మిగిలిపోయే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ TJ రేటింగ్‌: 2.5 / 5

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌ రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts