వరల్డ్ ఫేమస్ లవర్ పబ్లిక్ టాక్

February 14, 2020 at 11:13 am

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇసాబెల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేర మెప్పించిందో ఒక్కసారి చూద్దాం.

అసలు సినిమా కథ విషయానికొస్తే…గౌతమ్(విజయ్), యామిని(రాశిఖన్నా)లు కాలేజ్ డేస్ నుంచి లవర్స్…వీరి ట్రాక్ ఇలా నడుస్తుండగానే శీనయ్య(విజయ్), సువర్ణ(ఐశ్వర్య)లు భార్యాభర్తలు ట్రాక్ కూడా మరోవైపు నడుస్తుంది. అయితే ఈ ట్రాక్స్ నడుస్తుండగానే కేథరిన్, ఇసాబెల్ పాత్రలు కూడా వస్తాయి. వారితో కూడా విజయ్ ట్రాక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ విజయ్ ఒక్కడే ఉంటాడా, డ్యుయల్ పాత్ర పోషించాడా, మిగతా ఇద్దరి హీరోయిన్స్‌తో విజయ్ ఎలా ఉన్నడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక సినిమాలోని పాత్రలు పరంగా చూస్తే…విజయ్..నలుగురు హీరోయిన్స్ మధ్య తిరిగే ఈ కథలో ఊహించని మలుపులు ఉంటాయి. అయితే ఉండటానికి నలుగురు హీరోయిన్స్ ఉన్న మెయిన్ విజయ్, రాశి, ఐశ్వర్యల మధ్యే అసలు కథ ఉంటుంది. సినిమా మొత్తానికి విజయ్ డిఫరెంట్ పాత్రల్లో కనిపించడం హైలైట్. తనదైన నటనతో మరోసారి అదిరిపోయే పెర్ఫామెన్స్ ను అందించాడు.

ఇక హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ నటన హైలైట్ అని చెప్పాలి. మధ్య తరగతి మహిళగా ఐశ్వర్య అదరగొట్టింది. అలాగే రాశి కూడా లవర్ పాత్రలో బాగా మెప్పించింది. మిగతా ఇద్దరు కూడా పర్వాలేదనిపించారు. అయితే దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమా స్క్రీన్ ప్లేని మరి స్లోగా నడిపించాడు. దాని వల్ల బోర్ కొట్టే అవకాశాలున్నాయి. పైగా అర్జున్ రెడ్డి షేడ్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. దాని వల్ల సినిమాలో అంత ఎగ్జైట్‌మెంట్ ఉండదు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయ్యిపోవడం, పెద్ద ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్. అటు గోపి సుందర్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్..అంత గొప్పగా ఏమి లేదు. అయితే యూత్‌ పరంగా క్లిక్ అయ్యే అవకాశముంది.

వరల్డ్ ఫేమస్ లవర్ పబ్లిక్ టాక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts