వైఎస్ జగన్ కు బూస్ట్ ఇచ్చినా రాయిట‌ర్స్‌ క‌థ‌నం

February 26, 2020 at 5:23 pm

ఏపీ ప్ర‌భుత్వం ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా మూడు రాజ‌ధానుల ఏర్పాటును ప్ర‌తిపాదించింది. ఆ అంశాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మాకంగా తీసుకుంది. అందులో భాగంగా క‌ర్నూలును జ్యూడిష‌య‌రీ రాజ‌ధానిగా, విశాఖ‌ను ప‌రిపాల‌న శాఖ‌కు రాజ‌ధానిగా, అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా చేయాల‌ని భావిచిందింది. అందుకు సంబంధించిన బిల్లుల‌ను అసెంబ్లీలో కూడా ఆమోదించిన విష‌యం తెలిసిందే. మొద‌టి నుంచి మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై విప‌క్ష టీడీపీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ది. అమ‌రావ‌తి ప్రాంత రైతుల కోసం ధ‌ర్నాల‌ను చేస్తున్న‌ది. అదీగాక ప‌లువురు ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌ల‌ను గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా ప‌ట్టువిడ‌వ‌డం ఏపీ స‌ర్కారు మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతున్న‌ది. నిర్ణ‌యించిన మేర‌కు ఆయా ప్రాంతాల‌కు సంబంధిత కార్యాల‌యాల‌ను త‌ర‌లించే ప‌నిలో త‌ల‌మున‌లైంది.

స‌రిగ్గా ఇదే త‌రుణంలో ఏపీ స‌ర్కారు నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా, బూస్ట్ లాంటి క‌థ‌నాన్ని ప్ర‌చురించింది ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ న్యూస్ ఏజెన్సీ సంస్థ రాయిట‌ర్స్‌, ఆ క‌థ‌నం ప్ర‌చురితం కావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ క‌నిపిస్తున్న‌ది. ఏపీలో మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ సంస్థ కొనియాడింది. పరిపాలన వ్యవస్థను వికేంద్రీకరించడం కొత్తేమీ కాద‌ని, రాజధానిలోనే చట్టసభలు, సచివాలయం, హైకోర్టు అన్నీ ఉండాలనే నిబంధన ఏమీ లేదని, రాష్ట్ర భౌగోళిక స్వరూపం, ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటే పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న సంకల్పం మంచి నిర్ణయమని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. ఒక్క రాజధాని ప్రాంతంలోనే అభివృద్ధి జరగడం వల్ల భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో ఆర్థిక వృద్ధి తగ్గిందని రాయిటర్స్ సంస్థ పేర్కొన్న‌ది. వికేంద్రీకరణ అవసరమని త‌ద్వారా రాజధాని వంటి రద్దీ నగరాలపై ఒత్తిడి తగ్గుతుందని, అదీగాక ఉద్యోగాలు సృష్టించడానికి, ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడానికి, ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడానికి అది ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని అది అభిప్రాయ‌ప‌డింది. అయితే రాజధాని, కార్యాలయాల తరలింపు అనేది పక్కా ప్రణాళికతో సాగితేనే ఫలితం దక్కుతుందని, లేకపోతే భూమి, నీరు వంటి వనరుల‌పై తీవ్ర ప్రభావాలుంటాయని ఆ సంస్థ హెచ్చరించింది. రాయిట‌ర్స్ సంస్థ క‌థ‌నం ప్ర‌చురించ‌డంతో ఏపీ స‌ర్కారు వాదానికి బ‌లాన్ని చేకూర్చిన‌ట్ల‌యింది. ఆ పార్టీ నేత‌ల్లో కొత్త ఉత్సాహం నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా.. పరిపాలన రాజధాని విశాఖకు తరలించేందుకు ఏపీ స‌ర్కారు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాల‌ను చేపట్టింది. అదీగాక విశాఖ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్న‌ది. అందులో భాగంగా విశాఖలో వీలైనంత త్వరగా లైట్ మెట్రో రైలు పనులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న‌ది. రెండు దశల్లో లైట్ మెట్రో, మూడు ట్రామ్ కారిడార్ల ఏర్పాటు చేయాలన్న యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. విశాఖ బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్లు వచ్చేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సూచ‌న‌ల మేర‌కు బీచ్ అధికారులు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నారు. పాత పోస్టాఫీస్ నుంచి ఆర్కే బీచ్, రుషికొండ మీదుగా భీమిలీ వ‌ర‌కు బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్ నిర్మించాల‌ని,ఇక, ఎన్ఏడీ జంక్షన్-పెందుర్తి, అనకాపల్లి-స్టీల్ ప్లాంట్ వరకు మరో రెండు ట్రామ్ కారిడార్లు… స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక, తాటి చెట్లపాలెం, కొమ్మాది మీదుగా భోగాపురం ఎయిర్ పోర్టు వరకు లైట్ మెట్రో కారిడార్, మొత్తంగా 140 కిలో మీటర్ల మేర లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్లు ఏర్పాటు చేయాల‌ని ప్రాణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ మేర‌కు డీపీఆర్ రూపకల్పనతో పాటు టెండర్ల ఖరారును ఏకకాలంలో చేపట్టేలా అధికారులు స‌న్నాహాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వైఎస్ జగన్ కు బూస్ట్ ఇచ్చినా రాయిట‌ర్స్‌ క‌థ‌నం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts