వైఎస్ జగన్ స్నేహితుడు మృతి!

February 28, 2020 at 5:15 pm

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు విశాఖపట్టణం అనకాపల్లికి చెందిన ఏడిద జగదీష్….జగన్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అనకాపల్లి టౌన్ శ్రీరామ్ నగర్‌కు చెందిన ఏడిద జగదీష్, వైఎస్ జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. అసలు ఆయనకు జగన్ అంటే ఎంతో అభిమానం. అయితే జగన్ ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేస్తున్న సమయంలో అనకాపల్లిలో ఆయన్ను జగదీష్ కలిసి ఫోటో కూడా దిగారు.

అయితే ఆ ఫోటోతో పాటు, తన చిన్నతనంలో కలిసి చదువుకున్నప్పటి ఫొటోలని జగదీష్ తాజాగా ఫ్లెక్సీ వేయించుకున్నారు. ఆ ఫ్లెక్సీని ఇంటి ముందు కట్టడం కోసం డాబా మీదకు ఎక్కారు. అయితే ఫ్లెక్సీ కడుతున్నప్పుడు ఒక్కసారిగా గాలి వీయడంతో అది ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వైర్ల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్ తగిలింది. ఆ షాక్‌కు జగదీష్ చనిపోయాడు. అటు జగదీష్‌కు సాయం చేసిన ముప్పిడి శ్రీను అనే వ్యక్తి కూడా చనిపోయాడు. కాగా, జగదీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన భార్యకు దూరంగా ఉంటున్నారు.

వైఎస్ జగన్ స్నేహితుడు మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts