ఢిల్లీపైనే ఆశ‌లు.. జ‌గ‌న్ వ్యూహం నెర‌వేరేనా..?

February 12, 2020 at 10:38 am

మ‌ళ్లీ ఏపీ చూపులు ఢిల్లీవైపు తిరిగాయి. బుధ‌వారం సీఎం జ‌గ‌న్ మ‌ధ్యామ్నం 12.30 గంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. నేరుగా డిల్లీ వెళ్లి.. అక్క‌డ ప్ర‌దాని న‌రేంద్ర మోడీని క‌లుసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు, ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న‌ప‌రిణామాల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. వాస్త‌వానికి నెల రోజుల కింద‌ట కూడా ప్ర‌ధాని, అమిత్‌షాను క‌లుసుకునేందుకు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లినా.. అనూహ్య‌మైన కార‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న కు అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌లేదు. దీంతో తాజా ప‌ర్య‌ట‌న‌పై ఆశ‌లు మ‌రింత‌గా పెరిగాయి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అనేక కీల‌క స‌మ‌స్య‌లు, కేంద్రం చూపించాల్సిన ప‌రిష్కారాలు చాలానే ఉన్నాయి. ముఖ్య‌మైన శాస‌న మండ‌లి ర‌ద్దు, మూడు రాజ‌ధానుల ఏర్పాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, వెనుక‌బ‌డి న జిల్లాల‌కు నిధులు, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని కీల‌క అంశాల ప‌రిష్కారం వంటి ప‌లు అంశాలు కేంద్ర‌మే ప‌రిష్కారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించు కుంది. అయితే, ఇక్క‌డే మరో కోణం కూడా తెర‌మీదికి వ‌స్తున్న‌ట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో రాజ‌కీయ పొ త్తులు, రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పై కూడా జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీల మ‌ధ్య సంభాష‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

దీంతో తాజా జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అత్యంత ప్రాధాన్యంగా మారింది. నిజానికి గ‌తంలోనూ ఆయ‌న ప‌ర్య‌టిం చిన రాష్ట్ర మీడియా అనేక క‌థ‌నాలు వెలువ‌రించింది. కానీ, త‌ర్వాత కాలంలో మాత్రం ఆయా క‌థ‌నాలు అస‌లు విష‌యం కాద‌ని.. వేరే కీల‌క‌మైన అంశాల‌నే జ‌గ‌న్ మోడీకి వివ‌రించేందుకు వెళ్లార‌నేది వాస్త‌వమైం ది. ఇక‌, ఇప్పుడు కూడా సాధార‌ణ అంశాలు కాకుండా.. కీల‌క‌మైన విష‌యాల‌నే జ‌గ‌న్ చ‌ర్చించేందుకు వెళ్తున్నార‌ని అంటున్నారు. వీటిలో మండ‌లి ర‌ద్దు అనేది కీల‌కంగా ఉంటుంది. అదేవిధంగా రాజ‌ధానుల త‌ర‌లింపుపై మ‌రోసారికి మోడీకి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. రాష్ట్ర ప్ర‌భుత్వం దూకుడుగా ఉన్నా. మోడీ ఎలా రియాక్ట్ అవుతారోన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజా గా ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో న‌రేంద్ర మోడీ రాష్ట్రాల‌తో వ్య‌వ‌హ‌రించే తీరులో గ‌ణ‌నీయ‌మైన మార్పు ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఢిల్లీ ఫ‌లితాల త‌ర్వాత తొలిసారి జ‌గ‌న్‌తో జ‌రుగుతున్న భేటీలో మోడీ స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఢిల్లీపైనే ఆశ‌లు.. జ‌గ‌న్ వ్యూహం నెర‌వేరేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts