చంద్రబాబు సన్నిహిత వ్యక్తికి జగన్ రాజ్యసభ సీటు…!

February 15, 2020 at 10:25 am

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా భవిష్యత్తు లేదు అనే విషయాన్ని ప్రజల్లోకిబలంగా అధికార పార్టీ తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే జగన్ ఏమో ఆ విధంగా మరిన్ని కీలక అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక కీలక వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఆయనను కేంద్ర మంత్రిని కూడా చేసే ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటి వరకు బయటకు రాకపోయినా సరే కొన్ని కొన్ని విషయాల మీద మాత్రం పెద్ద చర్చలే జరుగుతున్నాయి. వచ్చే నెల ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు కాళీ కానున్నాయి.

ఆ నాలుగు స్థానాల్లో ఒకరిని వైసీపీ నేతగా ఎంపిక చేయగా ఇద్దరినీ బిజెపి నేతలుగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ఆ విధంగానే బిజెపితో చర్చలు జరిపారని అంటున్నారు. ఒకరికి మాత్రం చంద్రబాబు సన్నిహిత వ్యక్తికి ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. దీని గురించి ఇప్పటి వరకు ఏ సమాచారం బయటకు రాలేదు.

ఆ వ్యక్తి చంద్రబాబుకి న్యాయపరంగా కూడా ఇన్నాళ్ళు అండగా నిలుస్తూ వచ్చారని, ఇప్పుడు ఆయనకు పదవి ఇస్తే తనకు సహకారం ఉంటుందని, తద్వారా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు కేంద్ర పెద్దల అంగీకారం కూడా జగన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

చంద్రబాబు సన్నిహిత వ్యక్తికి జగన్ రాజ్యసభ సీటు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts