`యాత్ర‌`లో వైఎస్ విజ‌య‌మ్మ ఫొటోలు ఆ సైట్‌లోనా…తీవ్ర మ‌న‌స్ధాపంతో?

March 29, 2020 at 4:46 pm

ఆక‌తాయిల ఆగ‌డాలు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌యిపోతున్నాయి. ఫోటోలు మార్ఫింగ్ చేయడం, పోర్న్ సైట్స్, అడల్ట్ వెబ్ సైట్స్, డేటింగ్ వెబ్ సైట్స్ తో పోస్ట్ చేస్తున్నారు. ఇక న‌టి ఆశ్రిత వేముగంటికి కూడా ఇలాంటి ప‌రిస్థితే ఒక‌టి ఎదుర‌యింది. బాహుబ‌లి 2 చిత్రంలో అనుష్క వ‌దిన పాత్ర‌లో న‌టించిన ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆమె న‌టించిన త‌ర్వాత చిత్రం మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాత్ర చిత్రంలో వై.ఎస్‌.విజ‌య‌మ్మ‌గా న‌టించి అచ్చు గుద్దిన‌ట్లు ఆమె మ్యాన‌రిజ‌మ్స్‌ని దించేసింది ఈ న‌టి. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ఆ పాత్ర చెరిగిపోని ముద్ర వేసుకుంది.

ఇక ఇటీవ‌లె ఆమెకు ఓ చేదు అనుభ‌వం ఎదుర‌యింది. అదేమిటంటే ఆమెఫొటోలు అడ‌ల్ట్ వెబ్‌సైట్‌లో క‌నిపించాయి. కొంద‌రు వారి వెబ్‌సైట్ క్లిక్ అవ్వ‌డం కోస‌మ‌ని మ‌రికొంద‌రు అట్రాక్ష‌న్ కోసం సినీ హీరోయిన్లు సెల‌బ్రెటీల ఫొటోల‌ను వాడుతుంటారు. అలా ఈమె హాట్ ఫోటోలని సెక్స్ అప్పీల్ ఉండే విధంగా అసభ్యంగా ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా ఈమె ఫొటోలు కూడా ఆ వెబ్‌సైట్ లో ఉన్నాయి.

దాంతో అవి చూసిన ఆమె వెంట‌నే షాక్ అయి బాధ‌ప‌డుతూ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఇలా త‌న ఫొటోలను ఇబ్బంది క‌లిగే విధంగా పెట్టిన‌ట్లు స‌ద‌రు వెబ్‌సైట్ పై పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఆ ఫొటోల‌ను ఆమె ఈ వెబ్‌సైట్‌లో థ‌మ్‌నేల్స్ గా పెట్ట‌డంతో ఆమె కంట‌ప‌డ్డాయి.

`యాత్ర‌`లో వైఎస్ విజ‌య‌మ్మ ఫొటోలు ఆ సైట్‌లోనా…తీవ్ర మ‌న‌స్ధాపంతో?
0 votes, 0.00 avg. rating (0% score)