అల వైకుంఠపురములో అర్జున్ రెడ్డిని వాడుకున్న బన్నీ..!

March 16, 2020 at 5:22 pm

స్టైలష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఇటీవల రిలీజ్ అయ్యి ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కాగా ఈ సినిమా పాటలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

అయితే ఈ సినిమా రిలీజ తరువాత ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బన్నీ స్టైల్‌కు త్రివిక్రమ్ తోడవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగానే, డిజిటల్ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ కూడా తన సత్తా చాటుతూ ఉంది. తాజాగా ఈ సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఇందులో సుశాంత్‌కు సంబంధించిన కొన్ని విషయాలను బన్నీ సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేసి సుశాంత్‌కు చూపించి, అతడికి చెమటలు పట్టిస్తారు. ఈ క్రమంలో బ్యాక్‌గ్రౌండ్ వచ్చే అర్జున్ రెడ్డి మ్యూజిక్‌తో పాటు, అర్జున్ రెడ్డి పార్ట్ 2 అంటూ బన్నీ అనడంతో ఈ సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

అల వైకుంఠపురములో అర్జున్ రెడ్డిని వాడుకున్న బన్నీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts