హీరోగా 17 సంవత్సరాలు కంప్లీట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌..!!

March 28, 2020 at 3:17 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు.. ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉందో ఇప్పుడు ప్ర‌త్యేకంగా లెక్క‌లు అవ‌స‌రం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో బ‌న్నీకి అభిమానులున్నారు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడుగా, అల్లు అరవింద్ త‌న‌యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. గొప్ప పేరున్న కుటుంబంలో పుట్టడమే కాకుండా.. ఆ కుటుంబానికి ఇంకా గొప్ప పేరు తీసుకు వచ్చిన ఈయ‌న టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటికి 17 సంవ‌త్స‌రాలు కంప్లీట్ అయింది.

హీరోగా బన్నీ చేసిన మొదటి చిత్రం ‘గంగోత్రి’ .. ఈ సినిమా విడుదలై ఈ రోజుకి 17 సంవత్సరాలు పూర్తయింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమా తరువాత బన్నీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆర్య, బ‌న్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవ‌డు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మ‌రియు ఇటీవ‌ల విడుద‌లైన అల వైకుంఠ‌పురములో బ‌న్నీ న‌టించాడు.

ఇక సినిమా సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో తనకి తిరుగులేదనే విషయాన్ని నిరూపించడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని స్టైలీష్ స్టార్ అనిపించుకున్నాడు. తెలుగులోనే కాదు .. తమిళ .. మలయాళ భాషల్లోను ఆయన తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వంలో తన 20వ సినిమా చేసేపనిలో ఉన్నాడు.

హీరోగా 17 సంవత్సరాలు కంప్లీట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts