ఆర్ఆర్ఆర్‌ను ఢీకొడుతున్న బంటుగాడు..?

March 19, 2020 at 9:20 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఈ సినిమాతో నాన్-బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకున్న బన్నీ వెంటనే తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ ఓ సరికొత్త పాత్రలో మనకు కనిపిస్తాడు.

ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు వీరిద్దరు మళ్లీ కలిశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు.

కాగా వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌లో ఉన్నా కూడా సుకుమార్‌తో కలిసి తన సినిమాను అదే సమయానికి రిలీజ్ చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్‌ను ఢీ కొట్టేందుకు బన్నీ ఏమాత్రం జంకడం లేదని, సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని పలువురు బన్నీ గట్స్‌ను మెచ్చుకుంటున్నారు.

మరి అందరికీ షాకిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాను బన్నీ నిజంగానే ఢీ కొడతాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆర్ఆర్ఆర్‌ను ఢీకొడుతున్న బంటుగాడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts