బన్నీతో కోలీవుడ్ స్టార్ హీరో … సినిమా ఇక మాములుగా ఉండ‌దుగా?

March 12, 2020 at 2:18 pm

విజ‌య్‌సేతుప‌తి ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. కొత్త‌ద‌నానికి మారుపేరు విజ‌య్‌సేతుప‌తి అని చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్పుడు అంత మంచి పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వైవిధ్య‌భ‌రిత‌మైన న‌ట‌న‌ను క‌నబ‌రుస్తూ ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ త్వ‌ర‌లో సుకుమార్ చిత్రాన్ని మొద‌లుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం తాజా షెడ్యూల్ ఈ నెల 15 నుంచి కేర‌ళ అడ‌వుల్లో ప్రారంభం కాబోతోంది. అయితే పేరుకు కేర‌ళ అడ‌వులైనా సినిమాలో మాత్రం న‌ల్ల‌మ‌ల అడువులుగా చూపిస్తార‌ట‌. అక్క‌డ లొకేష‌న్స్ బాగుండ‌టంతో సుకుమార్ కేర‌ళాని సెలెక్ట్ చేసుకున్నార‌ని స‌మాచారం. అయితే అడ‌వుల్లో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది.

అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో విల‌న్‌గా త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న గెట‌ప్‌, మేన‌రిజ‌మ్స్ డిఫ‌రెంట్‌గా వుండ‌డంతో పాటు ఇక ఆయ‌న న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు సుక్కు తీసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా అదే. ఆహార్యం, ప్ర‌వ‌ర్త‌న‌ భీక‌రంగా వుంటుంద‌ని తెలుస్తోంది. ఇందులో విజ‌య్‌సేతుప‌తి ఫారెస్ట్ రేంజ‌ర్‌గా క‌నిపిస్తార‌ట‌. ఈ చిత్రం కోసం విజ‌య్ సేతుప‌తి 10 కోట్లు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. క్యారెక్ట‌ర్‌కున్న ప్రాముఖ్య‌త దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ ఆయ‌న అడిగినంతా ఇస్తున్న‌ట్టు ఇటీవ‌లే ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ప‌క్కా రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. మ‌రి దీని పైన ఫ్యాన్స్ మంచి అంచ‌నాల‌తో ఉన్నారు. అలాగే రోజురోజుకు తెలిసే అప్‌డేట్స్‌తో మ‌రింత ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నారు.

బన్నీతో కోలీవుడ్ స్టార్ హీరో … సినిమా ఇక మాములుగా ఉండ‌దుగా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts