మాస్ట‌ర్ మైండ్ ఫెయిల్ అవ్వ‌డానికి అస‌లు కార‌ణం ఏమిటంటే?

March 28, 2020 at 2:08 pm

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌లంద‌రిలోనూ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా స‌రే త‌న‌కు అనుకూలంగా మార్చేసుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు ఎవ్వ‌రూ లేర‌నే చెప్పాలి. ఇక ఎంత క‌ఠిన‌మైన ప‌రిస్థితులైనా స‌రే ఇండస్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఇండస్ట్రీ వ‌ర్గాలకే కాదు ఆయ‌న‌ని నిశితంగా ప‌రిశీలించిన ప్ర‌తీ ఒక్క‌రికీ ఈ విష‌యం తెలుసు. అలాంటి మాస్ట‌ర్ మైండ్ లెక్క త‌ప్పింది.

అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని స్టార్ హీరో మ‌హేష్ సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` పోటీ వున్నా దాన్ని అల‌వోక‌గా ఓవ‌ర్ టేక్ చేసి త‌న‌యుడికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని అందించాడు. అయితే ఆయ‌న త‌న సొంతంగా ఏర్పాటు చేసిన ఆహా ఓటీటీని మాత్రం స‌క్సెస్ చేయ‌లేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇండియా మొత్తం అలాగే ప్ర‌పంచ‌దేశాల‌న్నీ కూడా 21 డేస్ లాక్ డౌన్ ని ప్ర‌క‌టించింది. ఈ స‌మ‌యాన్ని జీ5, నెట్ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ విజ‌య‌వంతంగా స‌ద్విన‌యోగం చేసుకుంటున్నాయి. అయితే ఇలా వ‌చ్చిన డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ ని స‌ద్విన‌యోగం చేసుకుంటున్నాయి. అయితే ఆయ‌న పెట్టిన ఆహా మాత్రం ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోతోంది. కార‌ణం ఈ యాప్‌లో స‌రైన స్ట‌ఫ్ లేక‌పోవ‌డ‌మే. ఇందుకు అల్లు అర‌వింద్ ప్లానింగ్ ఫేయిల్ కావ‌డ‌మేన‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఆయ‌న ప్లానింగ్ ఎక్క‌డో దెబ్బ‌తినింది అని అనుకుంటున్నారుగాని ఆహా కోసం పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల‌ని దింపాడు కాని క‌రోనాతో కాస్త ఆ ప‌ని వెన‌క‌బ‌డింద‌ని చెప్పాలి. క‌రోనా కార‌ణంగా అనుకోకుండా ఆహాకి బ్రేక్ వ‌చ్చింది. అయితే దీని కోసం ఆల్రెడి త్రివిక్ర‌మ్ లాంటి పెద్ద ద‌ర్శ‌కుల‌ను అర‌వింద్ రంగంలోకి దింపిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఇప్పుడు ఆ ప‌ని వెన‌క‌బ‌డింది.

మాస్ట‌ర్ మైండ్ ఫెయిల్ అవ్వ‌డానికి అస‌లు కార‌ణం ఏమిటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts