ప్లాన్లు బాగానే ఉన్నాయి… మ‌రి క‌రోనా సంగ‌తేంటి?

March 29, 2020 at 5:20 pm

రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల‌వైకుంఠ‌పురంలో చిత్రంలో న‌టించి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే 2020… ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్ అని చెప్పాలి. ఎందుకంటే… మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఈ సంవ‌త్స‌రం. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఇదే ఉత్సాహంతో ఓ భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేశాడ‌ట‌. బ‌న్నీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ 28తో 17 ఏళ్ళు పూర్త‌య్యాయ‌ట‌. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అల్లు అర‌వింద్ త‌న కొడుకు కోసం భారీ ఈవెంట్‌ని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌.

ఇందు కోసం అల్లు అర్జున్‌తో వ‌ర్క్ చేసి డైరెక్ట‌ర్‌లు, నిర్మాత‌లు, హీరోయిన్‌ల‌ని ఈ ఈవెంట్‌కి ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. అయితే అనూహ్యంగా ప్ర‌పంచాన్ని వ‌ణికించే క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌ గ‌త వారం ప్ర‌దాని మోదీ ఇండియా మొత్తం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా దీంతో అల్లు అర్జున్, అల్లు అర‌వింద్ అనుకున్న ప్లాన్ క‌రోనా కార‌ణంగా ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. దీంతో 17 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ క‌రోనా దెబ్బ‌తో ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలోనే అల్లు అర్జున్ హ‌డావిడి కూడా అంత‌గా లేక‌పోవ‌డంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌.

ఇక ఎంతో మంచిగా ప్లాన్ చేసుకున్న వీళ్ళ‌కి ఈ క‌రోనా వ‌ల్ల దెబ్బ కొట్టేసింది. దీంతో బ‌న్నీ కాస్త ఢీలా ప‌డిపోయాడ‌ట‌. అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇంకేముంది అంటున్నారు కొంత మంది నెటిజ‌న్లు. మ‌రి దానికోసం ఢీలా ప‌డిపోతే ఎలా అంటూ మరికొంద‌రు వాపోతున్నారు.

ప్లాన్లు బాగానే ఉన్నాయి… మ‌రి క‌రోనా సంగ‌తేంటి?
0 votes, 0.00 avg. rating (0% score)