జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో కూడా ప‌ట్టించుకోవా…ప‌బ్లిక్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో ఏంటా ప‌నులు?

March 17, 2020 at 7:06 pm

బుల్లి తెర యాంక‌ర్లు ఈమ‌ధ్య కాలంలో ఏ విష‌యంలో నైనా హీరోయిన్ల‌ను మించిపోతున్నారు. అందులోనూ కాస్త క్రేజ్ ఉన్న యాంకర్ల‌యితే మ‌రీనూ. లోక‌ల్ గ్యాంగ్స్ అనే ఓ షోకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది అన‌సూయ‌. అందుకు సంబంధించి గ‌త వారం ఎపిసోడ్ ప్రోమో చూస్తే.. ఆమె ఓవ‌ర్ యాక్ష‌న్ ఏంటో మీకే అర్ధం మవుతుంది. అయితే ఆ ప్రోమో చూసిన నెటిజ‌న్లంతా అన‌సూయ‌ను షో నుంచి త‌ప్పించాలంటూ గోల పెడ‌తున్నారు. అయితే దీనికి అన‌సూయ కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తోంది. ఇది గ్లామ‌ర్ షో అని దీన్ని ఇలా చేస్తేనే చూస్తారు అంటోంది ఈ భామ‌.

ఇక‌ అనసూయ చెప్పేది కరక్టే కానీ చూసే జనంలో చిన్న పిల్లలు ఉంటారు.. ఓ తండ్రి తన కూతురుతో కలిసి చూస్తాడు. ఇలా ఫ్యామిలీలో అందరు చూస్తారు. వాళ్లు చూసేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారని నెటిజన్లు అంటున్నారు. ‘అబ్బో నీ యమ్మ గొప్పదే’ అంటూ శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టేజ్‌పై పెద్ద సినిమానే చూపించేస్తున్నారు అనసూయ, శేఖ‌ర‌మాస్ట‌ర్ క‌లిసి. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అన్న‌ట్లు ఆమె చీర క‌ట్టు అసలు ఆమె ఒంటిపై ఉన్నదాన్ని చీర అంటారా? అన్నట్టుగా నడుము, ఎదభాగం మొత్తం కనిపించేట్టుగా క‌నీసం పైట కూడా స‌రిగా వేయ‌కుండా.. శేఖర్ మాస్టర్‌తో రొమాన్స్ చేస్తూ ఎప్పటిలాగే అందాల‌ ఆరబోతకు పరిధిలు అంటూ లేవు అన్న‌ట్లు అన‌సూయ బిహేవియ‌ర్‌ని త‌ప్పుబ‌డుతున్నారు నెటిజ‌న్లు. సినిమాల్లో అందాలు మరి ఎక్కువైతే కట్ చెప్పడానికి సెన్సార్ బోర్డ్ ఉంది. కానీ బుల్లితెరపై అలాంటివి లేకపోవడం వల్ల అనసూయ రెచ్చిపోతుందంటున్నారు.

ఇంతలా మితిమీరి ప్ర‌వ‌ర్తించ‌డం అవ‌స‌ర‌మా అంటున్నారు కొంద‌రు? ఇక మ‌రికొంత మంది మంచిగా విన‌యంగా ఆలోచించండి మేడమ్ అని కొంతమంది చాలా సాఫ్ట్‌గా ఈ ప్రోమోపై రియాక్ట్ అవుతుంటే.. మరికొంత మంది బూతులు తిడుతున్నారు. ఆమెను ఆ షోనుండి తీసేస్తారా? లేక చూడటమే ఏకంగా మానేయమంటారా? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అలానే యాంకర్ సుమ హోస్ట్ చేస్తే ప్రోగ్రామ్‌కి రేటింగ్ ఎలా వస్తుంది? అది చూసైన నేర్చుకో అనసూయ అంటూ ఘాటుగా తిట్టిపోస్తున్నారు.

జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో కూడా ప‌ట్టించుకోవా…ప‌బ్లిక్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో ఏంటా ప‌నులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts