ఆ 60 కుటుంబాలకు అండగా యాంకర్ ప్రదీప్..!!

March 29, 2020 at 10:40 am

యాంక‌ర్ ప్ర‌దీప్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. టీవీ యాంకర్‌గా పరిచయమై తనశైలిలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రదీప్‌ సినిమాలకి కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌ నటించాడు కూడా.. ముఖ్యంగా 100% లవ్ అతనికి మంచి పేరును తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. ఈ మహమ్మరి కారణంగా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారీ పనుల ద్వారా బ్రతుకు జట్కా బండిని నడిపేవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది.

దీంతో సినీ ప్ర‌ముఖులు త‌మ‌కు తోచినంత సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లో స్టార్ యాంక‌ర్ ప్ర‌దీప్ వ‌చ్చి చేరాడు. దీనికి సంబందించి ఆయన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. తనకు తెలిసిన ఓ 60 కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు అందిస్తున్నానని పేర్కోన్నాడు. అంతేకాదు మనలో సాయం చేయగల స్థోమత ఉన్నవారు ముందుకొచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన విధంగా సాయం చేయాలనీ కోరాడు.

అలా ప్రదీప్ ఈ ఆపత్కాల పరిస్థితుల్లో తన మంచి మనసు చాటుకుని సామాజిక సృహా ఉన్న వ్యక్తిగా నిరూపించుకున్నాడు. కాగా, ప్ర‌స్తుతం ఈయ‌న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ ఒక సినిమా లో హీరోగా నటించారు. ఇక‌ ఈచిత్రంలో నీ పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా సినిమాలు వాయిదా పడటం మాత్రమే కాకుండా థియేటర్ లు కూడా బంద్ అయ్యాయి.

ఆ 60 కుటుంబాలకు అండగా యాంకర్ ప్రదీప్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts