డైరెక్టర్ కొడుకుతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అనుష్క‌..!!

March 13, 2020 at 5:36 pm

కింగ్ నాగార్జున్‌ `సూప‌ర్` సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి, భాగ‌మ‌తి వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. గ్లామర్‌ రోల్స్‌తో ఇండస్ట్రీ పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత యాక్షన్‌, హిస్టారికల్‌ రోల్స్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దంపైగా అగ్రనాయకిగా పరిశ్రమలో రారాణిగా వెలుగొందింది. గత కొంత కాలంగా కొత్త సినిమాలను అనుష్క అంగీకరించటం లేదు.

ఇక ఎప్పటి నుంచో ఆమె పెళ్లి వార్తలు వస్తున్నా.. అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే అనుష్క పెళ్లి పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనేనంటూ తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కూడా అనుష్క గురువారం క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా తన ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోకి చొరబడొద్దని సూచించింది. `నా పెళ్లి గురించి కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు.. అవన్నీ అవాస్తవాలు అని వెల్ల‌డించింది

అయినా నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే.. దాన్ని రహస్యంగా ఎందుకుంచుతాను. వివాహం జరిగిన రోజున తప్పకుండా ప్రజలకు తెలుస్తుంద`ని అనుష్క చెప్పింది. కాగా, కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వస్తాడు నా రాజు ఫేం హేమంత మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందిస్తున్నారు.

డైరెక్టర్ కొడుకుతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అనుష్క‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts