బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి ముద్దుగుమ్మ‌ల్లిద్ద‌రూ కొట్టుకుంటున్నారా?

March 29, 2020 at 9:53 am

ఇద్ద‌రు సీనియర్ హీరోయిన్లు న‌ట‌న‌లో.. క్రేజ్‌లో.. అందంలో..అభిన‌యంలో..ఒక‌రిని మించిన క్రేజ్ మ‌రొక‌రికి ఉంది. ఎవ్వ‌రినీ త‌క్కువ చెయ్య‌లేం. ఎవ్వ‌రినీ త‌క్కువ‌గా చూడ‌లేం. అలా ఉంట‌ది వారిద్ద‌రి పెర్ఫార్మెన్స్‌. ఇద్ద‌రూ కూడా సీనియ‌ర్ హీరోలంద‌రితోనూ న‌టించి మెప్పించిన వారే. వీరి పెర్‌ఫార్మెన్స్ అంతా ఇంతా కాదు. అదిరిపోయే రేంజ్‌లో ఉంఉటంది. న‌ట‌న‌లో వీరి పంధానే వేర‌ని చెప్పాలి.

ఒక బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి ఈ ఇద్ద‌రు హీరోయిన్‌ల మధ్య పోటీ న‌డుస్తోంది. బెంగ‌ళూరుకు చెందిన దేవ‌దాసిని నాగ‌ర‌త్న‌మ్మ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం దిగ్రేట్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు ఓ బ‌యోపిక్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. 88 ఏళ్ల వ‌య‌సులో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురాబోతుండ‌టం అంద‌రిలోనూ ఆశ‌క్తిని రేకెత్తిస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. దేవ‌దాసిగా వున్న నాగ‌ర‌త్న‌మ్మ ఆ త‌రువాత కాలంలో గాయ‌నిగా మారి మంచి పేరు తెచ్చుకుంది. ఇక జీవిత చ‌ర‌మాంకంలో యోగినిగా మారి మిగ‌తా జీవితాన్ని కొన‌సాగించింది. ఆమె క‌థ నేటి త‌రాల‌తో పాటు భావిత‌రాల‌కు స్ఫూర్తి మంతంగా వుంటుంద‌ని ఆయ‌న ఈ చిత్రాన్ని ఎలాగైనా తెర‌కెక్కించాల‌నుకుంటున్నారు. ఈ పాత్ర కోసం అనుష్క‌ని అనుకున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఆమెకు క‌థ‌ని కూడా వినిపించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్ర‌లో న‌టించాల‌ని అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా భావిస్తోంద‌ట‌. ఈ విష‌యం సింగీతం దాకా వెళ్లిన‌ట్టు తెలిసింది. ఈ ఇద్ద‌రిలో సింగీతం ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తాడ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి ముద్దుగుమ్మ‌ల్లిద్ద‌రూ కొట్టుకుంటున్నారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts