ఏపీలో క‌రోనా బంప‌ర్ ఆఫ‌ర్‌…ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోష‌న్‌!

March 26, 2020 at 3:09 pm

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌ల‌వర‌పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల ప‌ట్ల‌ ఎంతో బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ అడుగ‌డుగునా వారికి కావ‌ల‌సిన ప్ర‌తిది నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌తో స‌హా ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు. ఈ సంద‌ర్భంగా…

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్థి నేపథ్యంలో పాఠశాలలు మూత పడటంతో…. స‌రిగా క్లాసులు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఇంకా కొంత వ‌ర‌కు కోర్సు పూర్తి కాలేదు. దీంతో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించింది. ఇక ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల గురించి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అలాగే మ‌ధ్యాహ్న భోజ‌నం పై క్వాలిటీ మెయిన్‌టెయిన్ చెయ్యాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. విద్యాశాఖ మంత్రుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించి ఈ కీల‌క నిర్ణ‌యాన్ని ఆయ‌న తీసుకున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు. అలాగే యు.పి. స‌ర్కారు కూడా ప‌రీక్ష‌లు లేకుండా ప్ర‌మోట్ చేసే విధంగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ విష‌యం చెప్ప‌డ‌మే కాక స‌మీక్ష పూర్త‌య్యేలోపు ఆయ‌న మెమోని కూడా జారీ చేశారు.

ఇవి మాత్ర‌మే కాక ఆయ‌న అధికారికంగా చేయాల్సిన ప‌నుల‌ను కూడా చాలా చురుకుగా చేస్తున్నారు. పార్ల‌మెంట్ లాంటి విష‌యాలే వాయిదా ప‌డుతున్న‌నేప‌ధ్యంలో ప‌రిక్ష‌ల‌ను కూడా వాయిదా వేయ‌ద‌ల‌చుకున్నారు. ఏప్రిల్ 24 వ‌ర‌కు స్కూల్ ఉండ‌ని కార‌ణంగా ఆ మిడ్డేమీల్‌ని వీళ్ళ ఇంటిద‌గ్గ‌రే ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు. అంతేకాక ఆ పిల్ల‌లో న్యూట్రిష‌న్ వ్యాల్యూస్ పెర‌గాల‌ని ఆయ‌న ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. పిల్ల‌లో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచే విధంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మేర‌కు ఈ ఆదేశాల‌ను జారీ చేయ‌డం జ‌రుగుతుంది. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కూడా వాళ్ళ క్వార్ట‌ర్లీ హాఫెర్లీ ఎగ్జామ్స్ లో వ‌చ్చే మార్కుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆలోచిస్తున్నారు.

ఏపీలో క‌రోనా బంప‌ర్ ఆఫ‌ర్‌…ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోష‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts