ఆసీస్‌ క్రికెటర్‌కు కరోనా.. అయన ఎవరంటే !!

March 13, 2020 at 1:51 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా వైర‌స్ ల‌క్ష‌ణాలు ఎక్క‌డోక‌క్క‌డ క‌నిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ కరోనా కారణంగా ఈ రోజు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డే కు దూరం అయ్యాడు. గొంతు నొప్పి రావడంతో అతనికి కరోనావైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దీంతో అతను న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డేకు దూరమవుతున్నాడు.

ప్ర‌స్తుతం అతడికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిని క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ… “ అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత కేన్‌ 14 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అతడు గొంతుకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు మా వైద్య సిబ్బంది పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొటోకాల్‌ ప్రకారం అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నాం.

జట్టుకు దూరంగా ఉంచుతున్నాం. టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత.. అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంటాం“అని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, కరోనా వైరస్ కారణంగా ఆ,స్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే క‌రోనా కార‌ణంగా ప్రేక్షకులు లేకుండా నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆసీస్‌ క్రికెటర్‌కు కరోనా.. అయన ఎవరంటే !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts