దొంగ‌ల తెలివి.. కొత్త‌ప‌ద్ధ‌తుల్లో ఏటీఎంలో క్యాష్ చోరీ

March 5, 2020 at 4:33 am

ఇంత‌కుముందుకు ఏటీఎంల‌కు వ‌చ్చే అమాయ‌కుల‌ను, లేదంటే వృద్ధుల‌ను టార్గెట్గా చేసుకుని దొంగ‌లు త‌మ చోర‌క‌ళ‌ను ప్ర‌ద‌ర్శించేవారు. వారిని మాట‌ల్లో పెట్టి చాక‌చ‌క్యంగా సొమ్ము దోచుకునేవారు. ఇక ఇప్పుడు ఏకంగా ఏటీఎంల‌నే కొల్ల‌గొడుతున్నారు. ఏకంగా గ్యాస్ క‌ట్ట‌ర్ల‌తో ఏటీఎంల‌ను క‌ట్ చేస్తూ అందులోని డ‌బ్బుల‌ను తీసుకుని ఉడాయిస్తుండ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. ఈ వ్య‌వ‌హారం అటు పోలీసుల‌కు, ఇటు బ్యాంకు అధికారుల‌కూ త‌ల‌నొప్పిగా మారింది.

జనవరి నెలలో ఇదే అనంతపురం జిల్లా పెనుగొండలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి య‌త్నించి ఒక‌రు విఫలమ‌య్యాడు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కొని వచ్చిన ఆ దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏకంగా మెషిన్‌ ఎక్కి మరీ.. అక్కడున్న సీసీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత ఏటీఎం మెషిన్‌ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయినా, ఏటీఎం క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. అయితే గ్యాస్‌ కట్టర్ల కారణంగా ఏటీఎం మెషిన్‌ నుంచి మంటలు రావ‌డంతో. భయభ్రాంతులకు గురైన ఆ దొంగ వెంట‌నే అక్కడి నుంచి పరారయ్యాడు. తాజాగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో దొంగలు భీభత్సం సృష్టించారు. ఏటీఏం మిషిన్‌ను కట్‌చేసి డబ్బు దోచుకెళ్లారు. హయత్ నగర్లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలోకి దొంగలు గ్యాస్ కట్టర్లతో స‌హ ప్ర‌వేశించారు. మిషిన్‌ను కట్ చేసి అందులోని లక్షల రూపాయల‌ను ఎత్తుకెళ్లారు. మొదటిసారిగా కొత్త తరహాలో ఏటీఎం మిషన్‌లోంచి డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దొంగ‌ల తెలివి.. కొత్త‌ప‌ద్ధ‌తుల్లో ఏటీఎంలో క్యాష్ చోరీ
0 votes, 0.00 avg. rating (0% score)