సమరసింహారెడ్డి కాంబోకు ముహూర్తం ఫిక్స్.. తొడ కొట్టేందుకు ఫ్యాన్స్ రెడీ!

March 19, 2020 at 9:41 am

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత బాలయ్య మాస్ చిత్రాల దర్శకుడితో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య వరుసగా తన సినిమాలను క్యూలో పెట్టాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లు అందించిన దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల రికార్డును మరోసారి రిపీట్ చేసేందుకు వీరిద్దరు కలిసి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బి.గోపాల్ ఓ అదిరిపోయే కథను బాలయ్యకు వినిపించినట్లు తెలుస్తోంది.

గోపాల్ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందని, అందుకే సినిమాను వెంటనే ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ కాంబోలో రాబోయే సినిమాను పట్టాలెక్కించేందుకు పనులు చకచకా జరుగుతున్నాయట. ఇందులో భాగంగా ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అధికారికంగా లాంఛ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి బాలయ్య సినిమా చూసి ఫ్యాన్స్ తొడగొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

సమరసింహారెడ్డి కాంబోకు ముహూర్తం ఫిక్స్.. తొడ కొట్టేందుకు ఫ్యాన్స్ రెడీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts