పాత రేటుకే కొత్త సినిమా అంటోన్న బాల‌య్య‌… దెబ్బ‌కు దిగొచ్చాడా…!

March 17, 2020 at 4:47 pm

యువరత్న నందమూరి బాలకృష్ణ తన తరం హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. గత ఏడాది బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ఇక గత ఏడాది చివర్లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేసిన రూల‌ర్ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యింది దీంతో గత ఏడాది బాలయ్య క్లాప్ కొట్టారు బ్లాగులతో హ్యాట్రిక్ కొట్టారు ఇక ప్రస్తుతం బాలయ్య తనకు కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య మరో రెండు.. మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. ట్విస్ట్‌ ఏంటంటే ఈ సినిమాలకు తనకు పాత రెమ్యున‌రేష‌న్‌ వద్దని ఇప్పటికే నిర్మాతలకు చెప్పేస్తున్నాడట. రూల‌ర్‌ సినిమాకు ముందు బాలయ్య ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు. అయితే రూలర్ కు బాలయ్య రు. 10 కోట్లు డిమాండ్ చేయగా కష్టమైనా నిర్మాత సి.కళ్యాణ్ ఇచ్చుకోక తప్పలేదు. రూలర్ అంతా కలిపి రు. 10 కోట్ల షేర్ కూడా రాలేదు. దీంతో బాలయ్య తన మార్కెట్ పడిపోయింది అన్న విషయం తెలుసుకుని.. ఇప్పుడు తన పాత రేటు అయిన ఐదు కోట్లు ఇచ్చినా సినిమా చేస్తాను అని నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడట.

పాత రేటుకే కొత్త సినిమా అంటోన్న బాల‌య్య‌… దెబ్బ‌కు దిగొచ్చాడా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts