ఉద్యోగం ఇప్పిస్తామ‌ని ర‌ప్పించారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే …?

March 12, 2020 at 4:02 am

మ‌హిళ‌లను ఆట‌వ‌స్తువులుగా చూస్తున్నారు కొంద‌రు దుర్మార్గులు. మాయ‌మాట‌ల‌తో.. లేదంటే వారి అవ‌స‌రాల‌ను.. అమాయ‌క‌త్వాన్ని ఆస‌రా తీసుకుని ట్రాప్ చేస్తున్నారు. వ్య‌భిచార కూపంలోకి నెట్టి వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు. వారి మాట విన‌కుంటే చిత్ర‌వ‌ధ‌ల‌ను మొద‌లు పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎక్క‌డో ఒక చోట నిత్యం ఇలాంటి ఘ‌ట‌నలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా క‌ర్నాట‌క రాష్ర్టం బెంగుళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

బంగ్లాదేశ్‌కు చెందిన ప‌లువురు బెంగుళూరులోని క‌డుగోడి ఏరియాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాస‌ముంటున్నారు. ఇటీవ‌ల వారు అదే బంగ్లాదేశ్కు చెందిన ఓ బాలిక‌కు వ‌ల వేశారు. త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. వారి మాట‌ల‌ను న‌మ్మిన స‌ద‌రు బాలిక న‌గ‌రానికి చేరుకుంది. అంతే ఆ బాలిక‌ను వ్యభిచార కూపంలోకి దించేందుకు పూనుకున్నారు. అందుకు బాలిక ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా దూషిస్తూ విచక్షణారహితంగా కొట్ట‌డం మంద‌లు పెట్టారు. వారి బారి నుంచి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఒంటి నిండా గాయాల‌తో మేజెస్టిక్ ఏరియాలోని ఫుట్‌పాత్‌పై ప‌డిపోయింది. గ‌మ‌నించిన పోలీసులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. తక్షణం చిల్డ్రన్‌ హోంకి తరలించారు. అనంత‌రం ఆరా తీయడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో బాలిక‌ను వ్య‌భిచార‌ కూపంలోకి నెట్టాలని చూసిన బంగ్లాదేశీయులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

ఉద్యోగం ఇప్పిస్తామ‌ని ర‌ప్పించారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts