కరోనా వైరస్ దెబ్బకు పండగ చేసుకుంటున్న ఓటీటీ

March 16, 2020 at 11:23 pm

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లను వాయిదా వేయాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో చాలా సినిమా ఇండస్ట్రీలు మూతపడ్డాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ దెబ్బ పుణ్యమా చాలా రంగాల్లో పనిచేసే వారు ఖాళీగా ఉన్నారు.

అయితే ఒక రంగం వారికి మాత్రం కరోనా వైరస్ పుణ్యమా అని కాసుల వర్షం కురుస్తోంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు కూడా మూతపడటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటీటీ ప్లాట్‌ఫాంలపై పడ్డారు. ముఖ్యంగా విద్యార్ధులు, ఉద్యోగులు ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై ఆసక్తి చూపుతున్నారు. ఖాళీ సమయాన్ని సినిమా చూసి గడిపేయాలని చూస్తున్నవారు ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంలోని సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ప్లాట్‌ఫాం సంస్థలు మెంబర్‌షిప్ రుసుమును కూడా చాలా తక్కువగా వసూలు చేస్తుండటంతో చాలా మంది ఈ మెంబర్‌షిప్ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, హాట్‌స్టార్ తదితర డిజిటల్ ప్లాట్‌ఫాం రంగం వారికి కాసుల వర్షం కురుస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

కరోనా వైరస్ దెబ్బకు పండగ చేసుకుంటున్న ఓటీటీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts