చ‌దువులో పోటీ వ‌స్తున్నాడ‌ని.. స్నేహితుడిని హ‌త‌మార్చిన బాలుడు

March 13, 2020 at 4:21 am

బాల‌ల్లో నానాటికి నేర ప్ర‌వృత్తి పెరిగిపోతున్న‌ది. నైతిక విలువ‌లు.. స్ఫూర్తిదాయ‌క‌త్వం కొర‌వ‌డుతున్న‌ది. బాల్య‌ద‌శ‌లోనే ఈర్ష్యా ద్వేషాల‌తో ర‌గిలిపోతున్నారు. దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు. కుట్ర‌ల‌ను ప‌న్నుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తున్న‌ది ఈ సంఘ‌ట‌న‌. చ‌దువులో పోటీకి వ‌స్తున్నాడ‌ని ఈర్ష్యా పెంచుకున్న ఓ విద్యార్థి ఏకంగా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం త‌న స‌హ విద్యార్థిని అంత‌మొందిం చ‌డం తీర‌ని ఆందోళ‌న‌ను రేకెత్తిస్తున్న‌ది. మిగ‌తా విద్యార్థుల ద్వారా ఈ విష‌యం వెలుగు చూడ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తును చేప‌ట్టారు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న తెలంగాణ రాష్ర్టం నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్స్కూల్లో ఓ బాలుడు చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ రుగ్గా ఉండేవాడు. అతనికి పోటీగా అదే తరగతిలో మరో విద్యార్థి కూడా చదివేవాడు. దీంతో అతనిపై ఆ బాలుడికి ఈర్ష్యా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గత నెల ఫిబ్రవరిలో హైదరాబాద్‌ పర్యటనకు వెళ్లిన సంద‌ర్భంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. టీచర్లు అది చిన్న విషయమే అని పట్టించుకోలేదు. కానీ అప్ప‌టికే చ‌దువులో పోటీవ‌స్తుండ‌డం, ఘ‌ర్ష‌ణ‌దిగ‌డం వంటి సంఘ‌ట‌న‌ల‌పై మ‌న‌సులో క‌క్ష పెంచుకున్నాడు ఆ బాలుడు. ఎలాగైనా అత‌నిని అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందుకోసం ప‌క్కా ప్లాన్ వేశాడు. స‌ద‌రు బాలుడు గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకున్నాడు. అది త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులోఓ భాగంగా స‌ద‌రు స‌హ విద్యార్థితో ఘ‌ర్ష‌ణ‌తో దిగాడు. ఈ క్ర‌మంలో ఆ బాలుడి గుండెపైనే పిడి గుద్దులు గుద్దాడు. దీంతో బాలుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అనంత‌రం అత‌నికి గుండెపోటు వ‌చ్చింద‌ని చెప్ప‌డంతో అంద‌రూ న‌మ్మారు. ఇటీవ‌లే బాలుడి స్నేహితుల ద్వారా ఈ విష‌యం ఆ విద్యార్థి తండ్రికి అసలు తెలిసింది. దీంతో ఆయ‌న‌ నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌గా, పాతిపెట్టిన బాలుడి శవాన్ని వెలికి తీసి మరీ పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారణ చేప‌ట్టారు.

చ‌దువులో పోటీ వ‌స్తున్నాడ‌ని.. స్నేహితుడిని హ‌త‌మార్చిన బాలుడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts