గుట్టు ర‌ట్ట‌వుతుంద‌ని పెట్టెలో దాచింది ప్రియురాలు.. ప్రాణాల‌ను విడిచాడు ప్రియుడు..!

March 14, 2020 at 4:21 am

వావి వ‌రుస‌లు మ‌రిచారు. వ‌రుస‌కు అక్క‌, త‌మ్ముడ‌య్యే ఇద్ద‌రు అక్ర‌మ సంబంధం పెట్టుకున్నారు. గుట్టుగా ప్ర‌తి రోజూ రాత్రి క‌లిసి రాస‌లీల‌ను సాగిస్తున్నారు. ఇటీవ‌ల అలాగే క‌లుసుకున్నారు. అనుమానంతో కుటుంబీకులు త‌ల‌పుత‌ట్ట‌డంతో ఇద్ద‌రూ కంగుతిన్నారు. ఆ ప్రియురాలు వెంట‌నే త‌న ప్రియుడిని పెట్టెలో దాచింది. బంధువులు వెళ్లాక ప్రియుడి సంగ‌తి మ‌రిచిపోయి ఆమె హాయిగా నిద్రించింది. ఉద‌యం అస‌లు విష‌యం గుర్తువ‌చ్చి పెట్టె తెరువ‌గా అప్ప‌టికే ప్రియుడు మృతిచెందాడు. ఈ సంఘ‌ట‌న పాకిస్థాన్‌లో వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళ్తే..

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ముజఫర్‌‌గఢ్‌ పట్టణానికి చెందిన బీబీ అనే మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే భర్త ఉపాధి నిమిత్తం వేరే దేశానికి వెళ్లాడు. దీంతో ఆమె పిల్లలు, అత్తమామలతో సొంతింట్లో ఉంటోంది. ఇదిలా ఉండ‌గా ఇంటి సమీపంలోని వరుసకు తమ్ముడయ్యే అహ్మద్ బలూచ్(22)తో స‌న్నిహిత్యం పెరిగింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఉద‌యం వేళ తరుచూ కలుసుకోవడం కుదిరేది కాదు. దీంతో రాత్రివేళ కుటుంబ స‌భ్యులు అందరూ పడుకున్న తర్వాత అహ్మద్ ఆమె గదిలోకి వెళ్లేవాడు.. పనికాచ్చేసి సైలెంట్‌గా వెళ్లిపోయేవాడు. రోజూ రాత్రిపూట ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఎప్ప‌టిలాగే ఇటీవ‌ల కూడా అహ్మద్ ఆమె గ‌దిలోకి వెళ్లాడు. రాసలీలలు సాగిస్తుండగా ఆ అలికిడి విని కుటుంబసభ్యులందరూ నిద్రలేచారు. ఇంట్లో వెతకసాగారు. దీంతో తన బంఢారం బయటపడుతుందని ఆందోళన చెందిన బీబీ ప్రియుడిని ఓ చెక్కపెట్టెలో దాచేసింది. కుటుంబీకులు ఆమె గదిలోకి వచ్చి వెతికినా ఏమీ కనిపించకపోవడంతో ఎవరి గదికి వారు వెళ్లి నిద్రపోయారు. ఆ త‌రువాత ప్రియుడిని విషయం మరిచిపోయి బీబీ హాయిగా నిద్రపోయింది. ఆ చెక్క పెట్టెకు ఎలాంటి రంధ్రం లేకపోవడంతో అహ్మద్ ఊపిరాడ‌క అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే మెళ‌కువ వ‌చ్చిన తర్వాత ప్రియుడు గుర్తుకురావడంతో బీబీ కంగారు ప‌డుతూ వెళ్లి తలుపు తీయగా అప్ప‌టికే అత‌ను విగతజీవిగా కనిపించాడు.

గుట్టు ర‌ట్ట‌వుతుంద‌ని పెట్టెలో దాచింది ప్రియురాలు.. ప్రాణాల‌ను విడిచాడు ప్రియుడు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts