రెడ్డిగారిని పెళ్లి చేసుకున్న బ‌న్నీ భామ‌..!!

March 13, 2020 at 2:24 pm

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన ‘సీతాకోక చిలుక’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది షీలా కౌర్. అయితే అల్లు అర్జున్‌తో హీరోగా న‌టించిన ప‌రుగు చిత్రంతో షీలా హీరోయిన్‌గా న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే గ‌త‌ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు తెలుగు.. తమిళం.. కన్నడం భాషల్లో మొత్తంగా 24 చిత్రాలు చేసింది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఎట్టకేలకు పెళ్లి పీఠలు ఎక్కేంది.

ముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడింది షీలా. బుధవారం నాడు చెన్నైలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్టు తెలుస్తోంది. ఇక సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిన కారణంగా షీలా ఇండస్ట్రీ వారిని ఎవరు పిలవలేదని తెలుస్తోంది.

కాగా, అల్లు అర్జున్‌తో ‘పరుగు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ రామ్‌తో ‘మస్కా’ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు మెల్లగా ఆఫర్స్ తగ్గిపోవడంతో చివరిగా బాలయ్య ‘పరమవీర చక్ర’ సినిమాలో నటించింది. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. ఇలా తెలుగులో పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నా కూడా ఈ అమ్మడికి లక్ మాత్రం కలిసి రాలేదు. దీంతో ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇక గ‌త కొంత కాలంగా చెన్నైలో తన కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నారు షీలా.

రెడ్డిగారిని పెళ్లి చేసుకున్న బ‌న్నీ భామ‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts