హైద‌రాబాద్‌కి మాస్క్… కరోనా పేరుతో దోచేస్తున్నారా?

March 5, 2020 at 12:06 pm

ఏద‌న్నా ఒక‌టి కొత్త ర‌కం వ‌చ్చిందంటే చాలు జ‌నం అంతా దాని చుట్టూనే ఉంటారు. ఎలాగంటే బెల్లం చుట్టూ ఈగ‌ల్లా… ప్ర‌స్తుతం క‌రోనా బిజినెస్ న‌డుస్తోంది. ఇదేంటి వైర‌స్ క‌దా బిజినెస్ అంటున్నా అనుకుంటున్నారా? ప‌్ర‌స్తుతం ఈ క‌రోనా వైర‌స్ అనేది ఒక బిజినెస్‌లా మారిపోయింది. అదేమిటంటే… మొద‌ట చైనాలో మొద‌లైన ఈ వ్యాధి నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఇత‌ర దేశాల‌కు పాక‌డం మొద‌లుపెట్టింది. దాంతో ప్ర‌పంచ‌మంతా ఈ వ్యాధితో గ‌డ‌గ‌డ‌లాడుతోంది. ఇక తాజాగా తెలంగాణ సికింద్రాబాద్‌లో నివాస‌ముండే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి క‌రోనా సోకింది దీంతో మొద‌లైంది రాష్ట్రంలో గంద‌ర‌గోళం.

ఇక ఈ వ్యాధి రాకుండా ఇప్ప‌టికే చాలా మంది అధికారులు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ వైర‌స్ సోకిన వ్య‌క్తి వివిధ దేశాలు తిరిగి రావ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అయితే ఇది కేవ‌లం సికింద్రాబాద్‌లోని నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వచ్చిందని.. ఆ ఏరియాలో ఉండే వ్యక్తులు ఎవరు బయటకు రావడం లేదు. అంతేకాకుండా హైటెక్ సిటీలో ఓ కంపెనీ య‌జ‌మాని ఏకంగా వర్క్ ఫ్ర‌మ్ హోమ్ అనే దానిని కూడా అమ‌లు చేశారు. అంటే తాను చేసే ప‌నిని ఇంట్లోనే చేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది. కొన్ని స్కూల్స్ కి సెలవలు కూడా ప్రకటించేశారు.

ఇక‌ మరికొన్ని స్కూల్స్ కానీ.. ఆఫీస్‌లు కానీ మరె ఇతర జ‌నాలు ర‌ద్దీగా ఉన్న చోటికి వెళ్ళాల‌న్నా మాస్కులు ధరించి రావాల్సిందే అని ఆర్డర్ చేస్తున్నారు. దీంతో జ‌నాలంతా మాస్క్‌ల కోసం తెగ ఎగ‌బ‌డిపోతున్నారు. దీంతో దొరికిందే ఛాన్స్ గా వ్యాపారులు డబ్బును ధన్నుకుంటున్నారు. రెండు లేయర్లతో ఉన్న మాస్కు మాములు ధర రూ. 2 నుంచి 3 రూపాయల మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడు మెడికల్‌ దుకాణాదారులు ఒక్కోదానికి రూ.20 నుంచి 25 వరకు వసూలు చేస్తున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్‌95 మాస్కును రూ.300 లకు అమ్ముతూ ప్రజలను దోచేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద హాప్సిటల్స్ లో అయితే వీటికి గిరాకీ పెరిగింది. ప్రభుత్వం మాత్రం మాస్కులకు ఎలాంటి కొరుతా లేదని చెబుతున్నప్పటికి వ్యాపారులు మాత్రం ఈ విధంగా డబ్బు దోచుకుంటున్నారు.

వైరస్ రాకుండా ఉండాలంటే ఈ మాస్కులను ధరించాలనే డిమాండ్ ఉంది కాబట్టి రేటు ఎంతైన ప్రజలు కొంటున్నారు. ఇంకో విష‌యం ఏమిటంటే పిల్ల‌ల‌ను ఆక‌ర్షించేలా వీటిలో మ‌ళ్ళీ వివిధ ర‌కాల డిజైన్లు కూడా త‌యారు చేశారు. అయితే వీటిని సాధరణ ప్రజలు మాత్రం ఇంత చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు కూడా ఉన్న స్టాక్ ను దాచి.. నెమ్మదిగా ఎక్కువ రేటుకు మాత్రమే అమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధిక డబ్బు డిమాండ్ చేసే టైమ్ వాళ్ళ‌ది కాబట్టి.

ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే నిజానికి ఎవరికైన దగ్గు.. జలుబు ఉంటేనే ఈ మాస్క్‌ను ధ‌రించాలి అని కొంద‌రు వైధ్యులు తెలుపుతున్నారు. సో మాస్కుల మాత్రమే కరోనా వైరస్ నివరించవచ్చా అనేది ముందుగా మనసులో నుంచి తీసేసి. ముందు మ‌నం పరిశుభ్రంగా కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల్లో ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు మాస్కుల పేరుతో కోట్లలో బిజినేస్ జరిగింది. ఇక ఏదైనా తినే ముందు ముఖ్యంగా చేతులు శుభ్రంగా క‌డ‌గాలి. అలాగే వీలైనంత‌వ‌ర‌కు ఎంతో శుభ్ర‌త‌ను మెయింటెయిన్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు.

హైద‌రాబాద్‌కి మాస్క్… కరోనా పేరుతో దోచేస్తున్నారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts