క‌రోనా ప‌రీక్ష‌లు ఎవ‌రు చేయించుకోవాలి.. క్లారిటీ ఇచ్చిన‌ కేంద్రం..!!

March 28, 2020 at 3:40 pm

గతేడాది డిసెంంబరు చివరిలో చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19) ప్రస్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ప్ర‌జ‌ల‌కు తీవ్రంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పరిశోధకులు ఇప్పటికే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో సైతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 873 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది.

ఇక క‌రోనా బాధితుల్లో 79 మంది కోలుకోగా.. 775 మంది ప్ర‌స్తుతం హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందున్నారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న తీవ్ర ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా దగ్గినా..తుమ్మినా చుట్టూ ఉన్న భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇక సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భ‌య‌మే కొంద‌రిని చంపేస్తుంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో ఇచ్చింది.

గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే. కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పక పరీక్షలు చేయించుకోవాలి. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే. వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, ఇతర తీవ్రమైన వ్యాదులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించ

క‌రోనా ప‌రీక్ష‌లు ఎవ‌రు చేయించుకోవాలి.. క్లారిటీ ఇచ్చిన‌ కేంద్రం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts