నాగ‌చైత‌న్య ఫుల్ జోష్‌…నెక్స్‌ట్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్‌?

March 9, 2020 at 7:48 am

చైత‌న్య ఈ మ‌ధ్య కాలంలో న‌టించిన చిత్రాల‌న్నీ దాదాపుగా హిట్ల‌నే చెప్పాలి. శైల‌జారెడ్డి అల్లుడు, మజిలీ, వెంకీమామ సినిమాలతో తో మంచి హిట్లు అందుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా తరువాత చైతూ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో నటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పరశురామ్ మహేశ్ బాబు ప్రాజెక్ట్‌తో బిజీ అవటంతో చైతన్య మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అయితే సమంతకి ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ నందిని రెడ్డితో ఒక మూవీనీ ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన విక్రమ్ కుమార్ తో దిల్ రాజు నిర్మించే మరో సినిమాకు ఒకే చెప్పాడట. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాకు ‘థాంక్యూ’ అన్న టైటిల్ ని కూడా ఫిక్స్ చేశార‌ట‌. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావ‌ల్సి ఉంది.

ఇక చైతూఎక్కువ‌గా సాఫ్ట్ క్యారెక్ట‌ర్స్‌కి బాగా సూట్ అవుతాడు. ర‌ఫ్‌గా చేసే వాటికి పెద్ద‌గా హిట్ కాలేదు. అంటే త‌డాకా, స‌వ్య‌సాచి లాంటి స్టోరీలు చైతూకి హిట్ రాలేదు. అంటే రొమాంటిక్ ల‌వ్‌, ఫ్యామిలీ ఇలాంటి స్టోరీస్‌కి చై బాగా సూట్ అవుతున్నాడు. ఇలాంటి మూవీస్‌ని ఎక్కువ‌గా ఎంచుకుంటే బావుంటుంద‌ని ప‌లువురు అభిప్రాయాన్నివ్య‌క్తం చేస్తున్నారు.

నాగ‌చైత‌న్య ఫుల్ జోష్‌…నెక్స్‌ట్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts