చంద్ర‌బాబుకు టీడీపీ సీనియ‌ర్ నేత చుక్కలు..!

March 15, 2020 at 2:43 am

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న‌ట్లుగా మారింది టీడీపీ వ్య‌వ‌హారం. ఏపీలో స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు ఏమోగాని టీడీపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు.. తెలుగు త‌మ్ముళ్ల‌ మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌య లోపం త‌దిత‌ర అంశాలు తేట‌తెల్ల‌మ‌వుతున్నాయి. అదీగాక ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన ప‌లువురు సీనియ‌ర్లు తీరా స్థానిక ఎన్నిక‌ల ముందే పార్టీని వీడి అధికార వైసీపీ పంచ‌న చేరి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చారు. అదీగాక వారంతా కూడా ఫ‌క్తు టీడీపీ నేత‌లు. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకుని ఉంటున్న నిఖార్స‌యిన తెలగు త‌మ్ముళ్లు. వారిలో వేముల స‌తీశ్‌రెడ్డి, క‌ర‌ణం బ‌ల‌రాం, రామ‌సుబ్బ‌య్య త‌దిత‌రులున్నారు. వారే ఇప్పుడు తోక జాడిస్తుండ‌డం టీడీపీ దీన‌వ‌స్థ‌ను తెలియ‌జేస్తున్న‌ది. మ‌రోవైపు మ‌రికొంద‌రు నేతలు పార్టీలోనే ఉంటూ చంద్ర‌బాబు మాట‌ల‌నే పెడ‌చెవిన పెడుతున్నారు. ఇక వారిని ఏమ‌నాలో తెలియ‌ని స్థితిలోకి బాబు ప‌డిపోయాడు. ఏద‌న్న అంటే వారు కూడా పార్టీ వీడుతారేమోన‌ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో బాబు ప‌డిపోతున్నాడ‌ని స‌న్నిహితుల స‌మాచారం. అందుకే ఎలాంటి నేత‌ల విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌రిస్థితిలోకి జారిపోయార‌ని తెలుస్తున్న‌ది.

తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఏ రకంగా రియాక్ట్ అవుతారనే అంశం తెలుగు త‌మ్ముళ్ల‌లోనే కాదు, ఏపీ రాజ‌కీయాల్లోనే తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీలోని మొత్తం 33 వార్డులకు సంబంధించి టీడీపీ తరపున 13 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో ఆ మున్సిపాలిటీ దాదాపుగా వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే టీడీపీ తరపున ఎవరూ నామినేషన్ వేయకపోవడానికి అసలు కారణం కేఈ కృష్ణమూర్తి కావడ‌మే టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఆరాచకాలకు పాల్పడుతోందని, అందుకే డోన్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, డోన్ మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు వార్డులను కూడా వైసీపీకి దానం చేస్తున్నామ‌ని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఓ మున్సిపాలిటీలో టీడీపీ అనేక వార్డుల్లో పోటీకి దూరంగా ఉండడ‌డం ఏమిటని తెలుగు త‌మ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారు. అస‌లు ఈ అంశంపై చంద్రబాబుతో సంప్రదించి త‌రువాత‌నే కేఈ నిర్ణయం తీసుకున్నారా? లేక సొంతంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే దానిపై ఆ పార్టీ వర్గాల్లు చ‌ర్చించుకుంటున్నాయి. లేదంటే ఆయ‌న కూడా పార్టీ వీడే అవ‌కాశాలున్నాయా? అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కేఈ కృష్ణమూర్తి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.

చంద్ర‌బాబుకు టీడీపీ సీనియ‌ర్ నేత చుక్కలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts