టీడీపీకి అదిరిపోయే షాక్: పార్టీని వీడనున్న బడా నేతలు?

March 13, 2020 at 12:11 pm

టీడీపీకి షాకులు తగలడం ఆగేలా కనిపించడం లేదు. కీలక నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తమ్ముడు డోన్ మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కూడా పార్టీని వీడనున్నారని తెలుస్తోంది. నేడు ఆయన తన అనుచరులతో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించనున్నారని సమాచారం. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన వర్గీయులు స్పష్టం చేశారు. ఈయన వైసీపీలో చేరే అవకాశముందని అంటున్నారు.

ఇదే సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్దా రాఘవరావు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన కూడా వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. నేడో, రేపో వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కాగా, శిద్ధా 2014లో దర్శి నుంచి గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో పని చేశారు. మొన్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

టీడీపీకి అదిరిపోయే షాక్: పార్టీని వీడనున్న బడా నేతలు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts