చైనాకి క‌రోనా డ‌బుల్ షాక్‌?

March 28, 2020 at 9:30 am

క‌రోనా చైనాలో మ‌రోసారి కోర‌లు చాచింది. ఇప్పుడిప్పుడు వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్టింది అనుకుంటే త‌గ్గిన వారికి మ‌ళ్ళీ అక్క‌డి వారికి ఆ వ్యాధి తిర‌గ‌బెడుతుంది. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ ప్ర‌జ‌లంతా మృత్యువాత ప‌డుతూ భ‌య‌భ్రాంతుల‌తో భ‌య‌ప‌డుతున్నారు. ఈ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకకుండా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఏదో విధంగా వ్యాధి విస్త‌రింప‌బ‌డుతోంది. గురువారం దాదాపు 55 మందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వీళ్లలో 54 మంది విదేశాల నుంచి వచ్చిన వారని, ఒకరికి మాత్రం స్థానికంగా వైరస్‌‌‌‌ సంక్రమించిందని అక్క‌డి వారు తెలిపారు.

అయితే మూడు రోజులు తర్వాత జేజియాంగ్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో మాత్రం ఒక కేసు నమోదైందన్నారు. దీంతో మరోసారి ఈ వ్యాధి అడుగుపెట్టకుండా ఆ దేశం కట్టడి చర్యల‌ను చేప‌ట్టింది. ఫారినర్ల ను వాళ్ళ దేశంలోకి రాకుండా క‌ట్ట‌డి చేస్తుంది. అంద‌రి వీసాలను క్యాన్సిల్‌‌‌‌ చేసింది. ఫ్లైట్లను కూడా చాలా వరకు తగ్గించింది. మార్చి 28 వరకు వీటిని అమలు చేస్తున్నామంది. కొత్తగా వీసా కావాలనుకుంటే స్థానిక చైనా ఎంబసీల్లో అప్లై చేసుకోవాలని క‌ఠినంగా చెప్పింది. అంతేకాక రెసిడెన్షియల్‌‌‌‌ పర్మిట్‌‌‌‌ ఉన్న వాళ్లకు మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో అనుమతి లేద‌ని చెప్పింది. గురువారం హుబెయ్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో ఐదుగురు చనిపోయారని అక్కడి హెల్త్‌‌‌‌ కమిషన్‌ హెల్త్ బులిటెన్‌ని విడుద‌ల చేసింది. విదేశాల నుంచి వస్తున్న కేసుల్లోనూ చైనీయులే ఎక్కువ మంది ఉన్నారని.. అయితే వాళ్లు ఎక్కువగా ఇటలీ, యూరప్‌‌‌‌ దేశాల నుంచి వ‌స్తున్న వార‌ని తెలిపింది.

కోలుకున్న వారిలో 3 నుంచి 10 శాతం మందికి మళ్లీ పాజిటివ్ కేసులుగా న‌మోద‌య్యాయి. ఈ మేరకు సౌత్‌‌‌‌ చైనా మార్నింగ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ వెల్లడించింది. అయితే మళ్లీ వ్యాధి వచ్చిన వాళ్ల నుంచి వేరే వాళ్లకు సోకుంతుందా లేదా అన్న విష‌యం మాత్రం తెలియ‌డం లేదంది. ఓ హాస్పిటల్‌‌‌‌లో 145 మందికి న్యూక్లియిక్‌‌‌‌ యాసిడ్‌‌‌‌ టెస్టుల్లో ఐదుగురికి మళ్లీ వైరస్ తిర‌గ‌బ‌డింద‌ని టెస్టుల ద్వారా వెల్లడైంది. అయితే వాళ్లలో కరోనా లక్షణాలేవీ కనబడలేదని, వాళ్లలో ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ వాళ్లకూ పాజిటివ్‌‌‌‌ రాలేదని చెప్పింది. మరోవైపు వుహాన్‌‌‌‌లోని క్వారంటైన్‌‌‌‌ సెంటర్లలోని రికవరైన 5 నుంచి 10 శాతం మందికి పాజిటివ్‌‌‌‌ వచ్చిందని తెలిసింది. మ‌రి దీనికి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

చైనాకి క‌రోనా డ‌బుల్ షాక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts