మెగా ఫ్యాన్స్‌కు మెగా గిఫ్ట్ వ‌చ్చేది అప్పుడే..!!

March 30, 2020 at 11:54 am

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇది చిరంజీవికి 152వ సినిమా. కొరటాల శివ సినిమా అంటేనే అందులో కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అలాంటిదే అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్‌గా అందాల చందమామ కాజల్‌ని ఎంపిక చేసింది చిత్రబృందం. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఆచార్య ఫస్ట్ లుక్ ఉగాదికి చాలా రూమర్స్ వచ్చాయి గాని అది జరగలేదు.

నిజానికి అదే రోజున చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం.. చరణ్ భాగమైన ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల కావడంతో చిరు.. ఫ‌స్ట్ విడుద‌ల చేయ‌డం మానుకున్నారట. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. సో.. మెగా ఫ్యాన్స్‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున మెగా గిఫ్ట్ రానుంద‌న్న‌మాట‌.

మెగా ఫ్యాన్స్‌కు మెగా గిఫ్ట్ వ‌చ్చేది అప్పుడే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts