మెగాస్టార్ ఆచార్య‌కు ఎదురు దెబ్బ‌… మ‌ళ్లీ సైరాలాగే అవుతుందా…?

March 17, 2020 at 5:59 pm

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరి కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా ఓ సినిమా ఫంక్షన్లో చిరంజీవి నోరుజారి ఆచార్య అని చెప్పడంతో ఇప్పుడు అందరూ ఇదే టైటిల్ ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి గత రెండు సంవత్సరాలుగా అందరి నోళ్లలో నానుతున్న ఆచార్యకు ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇప్పటికీ హీరోయిన్ ఎవరో ఫైనల్ కాలేదు. త్రిష సైతం తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అందరికీ షాక్ ఇచ్చారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు లేదా రామ్ చరణ్ ల‌లో ఎవ‌రిని తీసుకోవాలి అన్న దానిపై పెద్ద చర్చలు నడిచాయి. ఇక చ‌ర‌ణ్ విష‌యంలో ఆర్ ఆర్ ఆర్‌తో డేట్లు క్లాష్ అవుతాయ‌ని రాజ‌మౌళి అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ సమస్య అలా వుండగానే కరోనా వ్యవహారం వచ్చింది. ఎలాగూ హీరోయిన్ లేదు అని షూటింగ్ వాయిదా వేశారు. దీంతో ఆగ‌స్టులో వ‌స్తుంద‌నుకున్న ఆచార్య కాస్త ఇక ఎప్ప‌ట‌కి రిలీజ్ అవుతుందో ? తెలియ‌ని ప‌రిస్థితి.

ఆ త‌ర్వాత వ‌రుస పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ ఉంది. ఆ సినిమాకు పోటీ వెళ్లే ప‌రిస్థితి లేదు. కరోనా వ్యవహారం మరికాస్త జటిలమై, సినిమాలు ఇప్పుడే రెడీ కాకపోతే, వకీల్ సాబ్ ను కూడా వెనక్కు జరపకతప్పదు. అప్పుడు ఆచార్య ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యే అవుతుంది. అదే జ‌రిగితే భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాకు స‌రైన రిలీజ్ డేట్ దొర‌క్క‌పోతే సైరా లాగా న‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది.

మెగాస్టార్ ఆచార్య‌కు ఎదురు దెబ్బ‌… మ‌ళ్లీ సైరాలాగే అవుతుందా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts