హీరో నితిన్‌కు చిరు ప్ర‌శంస‌ల జ‌ల్లు.. ఎందుకో తెలుసా..?

March 30, 2020 at 10:26 am

హీరో నితిన్.. ఇటీవ‌ల భీష్మ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్ర‌స్తుతం నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ‘రంగ్ దే’ అనే సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తొలిప్రేమ, మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేడు (మార్చి 30) నితిన్ పుట్టిన రోజు. అయితే హీరో నితిన్ ప్రస్తుత పరిస్థితుల్లో తన పుట్టినరోజు జరుపుకోవడం లేదనీ అదే విధంగా ఏప్రిల్ 16వ తేదీన ముందుగా నిశ్చయించుకున్న తన వివాహాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నాననీ ప్రకటించారు.

అలాగే అభిమానులు తన పుట్టిన రోజు వేడుకలను ఏ విధంగా కూడా జరుపవద్దని, ఇప్పుడు మనందరరం బాధ్యతగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల‌ని పిలుపినిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల కరోనా వైరస్‌పై పోరాటం చేయడంలో తన వంతు బాధ్యతగా యంగ్ హీరో నితిన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇక తాజాగా యంగ్ హీరో నితిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

నితిన్ కు చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా చిరు స్పందిస్తూ, నితిన్ ను యుద్ధ వీరుడిగా పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యక్రమాల కంటే ప్రజల సేఫ్టీకే ప్రాధాన్యతను ఇచ్చావని కొనియాడారు. కరోనాపై పోరాటంలో నీ స్ఫూర్తి చాలా గొప్పదని… మన దేశాన్ని ఆ మహమ్మారి కబలించకుండా చేస్తున్న పోరాటంటో నీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ‘నీకు, నీ కాబోయే భార్యకు శుభాకాంక్షలు’ అని తెలిపారు.

హీరో నితిన్‌కు చిరు ప్ర‌శంస‌ల జ‌ల్లు.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts