టాలీవుడ్లో మెగా లీడ్ ..దాసరి లోటు తీరిందా ..?

March 30, 2020 at 11:54 am

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఒకప్పుడు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రినారాయ‌ణ‌రావు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉంటూ ఎటువంటి ఇబ్బంది.. ఏస‌మ‌స్య‌లు వ‌చ్చినా ఆయ‌నే పెద్ద‌గా ఉంటూ.. ప్ర‌తి స‌మ‌స్య‌ని ప‌ట్టించుకుని దాన్ని ప‌రిష్క‌రించేవారు. ఇక ఆయ‌న మాట‌కు ఎదురూ లేదు. ఎవ్వ‌రైనా స‌రే ఆయ‌న మాట వినాల్సిందే. ఆ విధంగా ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న్ని గౌర‌వించేవారు. అనుకోకుండా ఆయ‌న చ‌నిపోవ‌డంతో ఇక్క‌డ ఇక్క‌డ జ‌రిగే ఇబ్బందుల‌ను..పొర‌పాటుల‌ను ప‌ట్టించుకునే నాధుడే లేకుండా పోయింది. ఆయ‌న‌లాగా ప‌ట్టించుకుని ప్ర‌తిది త‌న నెత్తిన వేసుకుని చూసేవారే లేకుండా పోయారు. మ‌రి ఆయ‌న త‌ర్వాత కొంత కాలం ద‌ర్శ‌కుడు కోడిరామ‌కృష్ణ అప్పుడ‌ప్పుడు చూసేవారు. ఇప్పుడు ఆయ‌న కూడా లేక‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీ దిక్కులేనిది అయిపోయింద‌ని చెప్ప‌డానికి ఏమాత్రం సందేహం లేదు.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప‌ట్టించుకోడానికి ముందుకొచ్చారు. అయితే ఆయన దాస‌రిగారిలాగా ఆ స్ధానాన్ని తీసుకోనప్ప‌టికీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ‌కు ఏద‌న్నా సమస్యలు వచ్చినపుడు పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేస్తూ నెమ్మదిగా టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న కొన్ని సోష‌ల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌లో న‌టిస్తున్నారు. అయితే ఇటీవ‌లె `మా`లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను సైతం చిరు లీడ్ తీసుకుని ప‌రిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాక గ‌తంలో తన కుటుంబ సభ్యుల సినిమాలకే మాత్ర‌మే ఆయ‌న గెస్ట్‌గా వచ్చేవాళ్లు.

అయితే గ‌త ఏడాది మాత్రం చిన్న సినిమాల‌కు సైతం బ‌య‌ట హీరోల‌యిన‌ప్ప‌టికి ఆయ‌న అండ‌గా నిల‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిశ్ర‌మ‌కి న‌డిపిస్తున్న చిరుకి మిగ‌తా హీరోలు కూడా హెల్ప్‌గా నిల‌బ‌డ్డారు. పవన్ రూ.2 కోట్ల భారీ విరాళంతో ఇండస్ట్రీలో కదలిక తెస్తే.. చిరు సినీ కార్మికుల కోసం కోటి విరాళంగా అందించారు. ఇక ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ రూ.70 లక్షలిచ్చాడు. అంతేకాక సినీ కార్మికుల కోసం ఇంకో రూ.30 లక్షల విరాళం ప్రకటించాడు. ఇక అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, సాయిధరమ్ తేజ్ రెండు విడతలుగా రూ.10 పదేసి లక్షల చొప్పున విరాళం ఇచ్చాడు. మొత్తానికి కేవ‌లం ఈ ఒక్క ఫ్యామిలీ నుండే ఐదు కోట్ల విరాళం అందింది. వీళ్ళు ముందుగా లీడ్ తీసుకుని చేస్తున్న ఈ ప‌నిని ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శంసిస్తున్నార‌నే చెప్పాలి.

టాలీవుడ్లో మెగా లీడ్ ..దాసరి లోటు తీరిందా ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts