మెగాస్టార్ చిరు ఈ విమ‌ర్శ‌లు ఎలా తీసుకుంటారో…?

March 25, 2020 at 5:06 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని సోష‌ల్ మీడియా ఏ రేంజ్లో శాసిస్తుందో ? ప‌్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అస‌లు ప్ర‌పంచం అంతా ఇప్పుడు సోష‌ల్ మీడియా దెబ్బ‌తో ఓ కుగ్రామంలా మారిపోయింది. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ మూలు ఏం జ‌రిగినా ? చీమ చిటుక్కుమ‌న్నా క్ష‌ణాల్లోనే అంద‌రికి తెలిసి పోతోంది. ఇక ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుల నుంచి.. సినిమా సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియాలోని వివిధ అక్కౌంట్ల‌లో యాక్టివ్గా ఉంటున్నారు. ఫేస్‌బుక్‌, ట్వీట్ట‌ర్‌.. ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్ల‌లోనే త‌మ గురించిన విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

ఇప్పుడు ఏ హీరోకు సోష‌ల్ మీడియాలో ఎంత‌మంది అభిమానులు ఉన్నారు ? అన్న‌ది ఓ స్టేట‌స్‌గా మారిపోయింది. తెలుగు హీరోలు ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌.. మ‌హేష్‌బాబు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక సీనియ‌ర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పుడు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. త‌మ అభిమాన న‌టుడు సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చి త‌మ‌తో ట‌చ్‌లో ఉండ‌డం ఏ హీరో అభిమానుల‌కు అయినా ఉత్సాహంగానే ఉంటుంది. అయితే సోష‌ల్ మీడియాతో ఎన్ని ప్ల‌స్సులు ఉన్నాయో ? అన్ని మైన‌స్‌లు కూడా ఉన్నాయి.

సోష‌ల్ మీడియాలో త‌మ‌కు న‌చ్చ‌ని హీరోల విష‌యంలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ ఎక్కువ చేస్తుంటారు. కొన్ని కామెంట్లు భ‌రించ‌లేనివిగా ఉంటాయి. కొన్ని మ‌న‌స్సుల‌ను గాయ‌ప‌రిచేలా ఉంటాయి. కొన్ని ఆనందించేలా ఉంటాయి. మ‌రి వీటి విష‌యంలో చిరు ఎలా రిప్లే ఇస్తారు ? అస‌లు సోష‌ల్ మీడియా అంటేనే పెద్ద రొచ్చు… ఇలాంటి కామెంట్ల‌ను లైట్ తీస్కొంటారా ? లేదా త‌న‌దైన స్టైల్లో రిప్లే ఇస్తారా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఏదేమైనా చాలా రోజుల‌కు చిరు సోష‌ల్ మీడియాలోకి రావ‌డం ఆనందించ ద‌గ్గ ప‌రిణామం అనే చెప్పాలి.

మెగాస్టార్ చిరు ఈ విమ‌ర్శ‌లు ఎలా తీసుకుంటారో…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts