కాజల్ దెబ్బకు స్వీటీయే బెస్ట్ అంటోన్న మెగాస్టార్

March 16, 2020 at 11:13 am

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ ‘ఆచార్య’గా మెగాస్టార్ ఇటీవల అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

కాగా ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ఎసరుపెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాకు తొలుత హీరోయిన్‌గా అందాల భామ త్రిషను ఎంపిక చేశారు చిత్ర యూనిట్. చివరి నిమిషంలో త్రిష కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది. వెంటనే వారు మరో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ను ఈ సినిమాలో తీసుకోవాలని చూశారు.

కానీ ఆమె ఈ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తుండటంతో మరో స్టార్ బ్యూటీ అనుష్కను తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాజల్ తన రెమ్యునరేషన్ విషయంలో రాజీకి వచ్చినట్లయితేనే ఆమెను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈ సినిమాలో చందమామ చేరుతుందా లేక స్వీటీకే సెట్ అవుతుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాజల్ దెబ్బకు స్వీటీయే బెస్ట్ అంటోన్న మెగాస్టార్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts