సినీ కార్మికులకు చిరంజీవి భారీ విరాళం …….!!

March 26, 2020 at 4:57 pm

ప్రస్తుతం దాదాపుగా అన్ని దేశాలను కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వ్యాధి కట్టడికి ఆయా దేశాలు కూడా గట్టిగా చర్యలు చేపట్టాయి. ముందుగా ప్రజలను బయటకు రానీయకుండా ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితం చేసేలా ఇప్పటికే లాకౌట్ లు ప్రకటించిన దేశాలు, అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే ఈ వ్యాధిని త్వరగా నివారించగలమని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే ఈ లాకౌట్ ల వలన ఎందరో ప్రజలు ఇంటికే పరిమితం అవడంతో, తమకు పని లేక ఇల్లు గడిచే పరిస్థితి లేక ఆర్ధికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

 

అయితే అటువంటి వారి కోసం ఇప్పటికే కేద్ర ప్రభుత్వం తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయాన్ని ప్రకటించగా, పనులు లేకుండా ఎంతో సతమతం అవుతూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి సినిమా ప్రముఖులు కూడా తమ దయార్ద్ర హృదాయంతో సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

 

ఇప్పటికే పలువురు నటీనటులు, దర్శకులు తమ వంతుగా తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు అలానే టాలీవుడ్ కార్మికులకు సాయం అందించగా, కాసేపటి క్రితం టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ కరోనా మహమ్మారి వలన పనులు కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ సినిమా కార్మికుల కోసం రూ.1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికులను ఆదుకోవడం మన విధి అని, అలానే మిగతా వారు కూడా ముందుకు వచ్చి తమవంతుగా వీలైనంత సాయం అందిస్తే బాగుంటుందని మెగాస్టార్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేసారు……!!

 

సినీ కార్మికులకు చిరంజీవి భారీ విరాళం …….!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts