క‌రోనా ఎఫెక్ట్‌తో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌..!!

March 28, 2020 at 12:15 pm

క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 27,250 మంది కరోనా వల్ల మృతి చెందారు. 5.94 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు1.33 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. చైనాలోని వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ భార‌త్‌లోనూ విజృంభిస్తుంది. ఇక తెలంగాణ‌లో సైతం క‌రోనా పాసిటివ్ కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు టెక్నాలజీని యూజ్ చేయ‌నున్నారు. అలా వచ్చేవారికి జియో ట్యాగింగ్ ఇవ్వబోతోంది. అంటే వాళ్ల చేతులకు బ్యాండ్ వేస్తారు. దానికి ఓ నంబర్ లాంటిది ఇస్తారు. ఇది జీపీఎస్ లొకేషన్‌తో పనిచేస్తుంది.

అందువల్ల వాళ్లు ఎక్కడికి వెళ్లినా జియో ట్యాగింగ్ ద్వారా తెలిసిపోతుంది. దీంతో ప్రభుత్వం కళ్లుగప్పి ఇళ్లలోంచి బయటకు వస్తే తెలిసిపోతుంది. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు ఇంటి నుంచి 50 మీటర్ల దూరం వెళ్లారంటే చాలు… పోలీస్ కంట్రోల్ రూంకి మెసేజ్ వెళ్లిపోతుంది. వెంటనే పోలీసులు ఎంటరై… ఆ వ్యక్తిని కంట్రోల్ లోకి తీసుకుంటారు. అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు. ఇందుకు ప్రత్యేక యాప్ తయారుచేశారు.

క‌రోనా ఎఫెక్ట్‌తో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts