అమెరికాలో ఒక్కో మనిషికి ట్రంప్ కరోనా ప్యాకేజీ ..ఎంతంటే ..?

March 25, 2020 at 3:41 pm

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌తో అత‌లాకుతలం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వైర‌స్ బారిన ప‌డి తీవ్రంగా న‌ష్ట‌పోయిన వారికి ట్రంప్ స‌హాయం చేయ‌బోతున్నారు. ఇక పేద‌వాళ్ల‌కు 1200డాల‌ర్లు చ‌ప్పున ఆయ‌న ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పెరుగుతున్న డాలర్ విలువను దృష్టిలో పెట్టుకుని అటూ ఇటుగా చూసుకున్నా మన రూపాయల్లో లక్ష.రూపాయ‌లు అని చెప్పాలి. అమెరికన్ పౌరులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం ప్రకటించారు. అయితే ఇది కేవ‌లం పెద్దవాళ్లకు మాత్ర‌మే కాక ఇటు చిన్న పిల్లలకు కూడా ఈ ప్యాకేజీలో భాగం ఉంటుంది. చిన్న పిల్లలకు 500 డాలర్లను అందించబోతున్న‌ట్లు స‌మాచారం. కరోనా వైరస్ కారణంగా.. ఎమ‌ర్జెన్సీ ప్రకటించడంతో పాటు.. చాలా మంది ఎన్నో ర‌క‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా రెండు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక ప్యాకేజీకి అమెరికా సెసెన్ ఆమోదం తెలిపింది. రెండు ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపుగా మన రూపాయల్లో 150 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అమెరికాను షట్ డౌన్ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా లేరు. కానీ.. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని అమలు చేస్తున్నారు.

ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవ్వ‌డంతో ఆయ‌న ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో.. వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్కరి ఉపాధి, వ్యాపారానికి ఇబ్బంది ఏర్పడటంతో తక్షణం వారందర్నీ ఆదుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఆయ‌న ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ట్రంప్ ఆందోలన చెందుతున్నారు. అందుకే.. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆర్థిక ప్యాకేజీకి సెనెట్‌లో ఆమోద ముద్ర వేయించుకోగలిగారు. ప్యాకేజీలో కేటాయించిన నిధుల్లో 367 బిలియన్ డాలర్లు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేటాయించారు. మ‌రి మునుపెన్న‌డు ఇలాంటి ప్యాకేజి గురించి విన‌ని వాళ్ళ‌కి ఇది చాలా విడ్డూరంగా క‌నిపిస్తుంది.

ఇక ఉద్యోగులు విష‌యానికి వ‌స్తే వారు పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు కాబ‌ట్టి. వారందరికీ.. ఇబ్బందులు లేకుండా జీతాలు చెల్లించేందుకు ఈ మొత్తం వెచ్చిస్తార‌ట‌. ఇక బడా వ్యాపార సంస్థలకూ భారీ సాయం ప్రకటించారు. 500 బిలియన్ డాలర్లు.. గ్యారంటీలకు.. సబ్సిడీలకు కేటాయించారు. అత్యధికంగా హాస్పిటల్స్‌కు ఎక్కువ‌ నిధుల‌ను అందించబోతున్నారు. ఎక్కడివక్కడ ఆగిపోయిన ఎయిర్‌లైన్స్ సంస్థలకూ సాయం చేయబోతున్నారు. అమెరికా చరిత్రలో ఇంత భారీ ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడూ ప్రకటించలేదు. మ‌రి ఇంత మంచి ప్యాకేజీలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గ్గ ప్యాకేజి ఏమిటంటే యువ‌కుల‌కి నేరుగా డ‌బ్బులు ఇవ్వడం.

అమెరికాలో ఒక్కో మనిషికి ట్రంప్ కరోనా ప్యాకేజీ ..ఎంతంటే ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts