న్యూస్‌పేప‌ర్లు మాకొద్దు బాబోయ్ అంటున్న ప్ర‌జ‌లు.. ఎందుకో తెలుసా..?

March 24, 2020 at 8:55 am

కరోనా వైరస్(కోవిడ్‌-19).. ఈ పేరు వింటేనే ప్ర‌జ‌ల‌ గుండెల్లో గుబులు రేగుతోంది. చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాలను క‌మ్మేసింది. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక కరోనా వైరస్ వస్తే దీనికి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతారని చెబుతున్నారు నిపుణులు. ఇక
కరోనా వైరస్ ను కట్టడి చేయానికి దేశం యావత్తు నడుంబిగించింది.

దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి. ఇదిలా ఉంటే న్యూస్ పేప‌ర్లు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్ర‌జ‌లు. ఎందుకంటే.. ప్రతీరోజు ఇంటింటినీ పలకరించే న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు కరోనా వ్యాప్తికి కేరియర్లుగా మారే అవకాశం లేకపోలేదనే వాదనలు ఇప్పుడు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప‌లు విద్యాసంస్థల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ప‌లు క‌రోనా వ్యాప్తికి కార‌కాలుగా చెప్ప‌బ‌డే అంశాల‌ను వెల్ల‌డించారు. గాలిలో కరోనా వైరస్ 3 గంటలు బతికి ఉంటుంద‌ట‌.

అలాగే ప్యాకింగ్ అట్టపెట్టల్లో 24 గంటలు, చెక్క, పేపర్లపై కరోనా వైరస్ ఏకంగా 5 రోజుల పాటు బతికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం ఇప్పుడు దినపత్రికల సర్క్యులేషన్ పై క‌నిపిస్తోంది. కరోనా వైరస్ పేపర్ పై 9 గంటల పాటు జీవించి ఉంటుందనే విషయం వెల్లడి కావడంతో చాలా మంది పత్రికలు ఇంటికి తెప్పించుకోవడం ఆపివేస్తున్నారు.

న్యూస్‌పేప‌ర్లు మాకొద్దు బాబోయ్ అంటున్న ప్ర‌జ‌లు.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts