క‌ల‌వ‌క‌పోతే.. క‌ష్ట‌మే అవినాష్ పాలిటిక్స్‌పై అప్పుడే విమ‌ర్శ‌లు..!

March 17, 2020 at 3:24 pm

దేవినేని అవినాష్‌. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన దేవినేని రాజ‌శేఖ‌ర్ నెహ్రూ.. వార‌సు డిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అప్పుడే 6 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ ఆరే ళ్ల‌లో అవినాష్ మూడు పార్టీలు మారారు. 2014లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేశా రు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో కేవ‌లం 39 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సంపాయించుకుని డిపాజిట్ కూడా పోగొ ట్టుకున్నారు. ఆ త‌ర్వాత తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డిచి.. కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గుడివాడ ఎమ్మెల్యే స్థానం నుంచి ఆయ‌న పోటీ చేశారు. అయి తే, ఇక్క‌డ కూడా ఆయ‌న ఓడిపోయారు. అయితే, పార్టీలో అంతో ఇంతో గుర్తింపు ల‌భించింది. తెలుగు యువ త అధ్య‌క్షుడు అయ్యారు. కానీ, ఇంత‌లోనే ఈ పార్టీని కూడా విడిచి పెట్టి.. వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా కొన‌సాగుతున్నారు. అయితే, అవినాష్ రెండు సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. అయిష్టంగా పోటీ చేశారు. తొలిసారి ఏకంగా ఎంపీగా పోటీ చేశారు. త‌న‌కు ఇష్టం లేకున్నా.. తండ్రి బ‌లవంతం చేయ‌డంతో పోటీ చేశాన‌ని ఆయ‌నే చెప్పుకొన్నారు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు ఇష్టం లేకున్నా.. చంద్ర‌బాబు కోరిక‌, బ‌లవంతం మేర‌కు గుడివాడ‌లో పోటీ కి దిగిన‌ట్టు చెప్పుకొన్నారు. అంటే.. ఆరేళ్ల‌లో ఆయ‌న రెండు సార్లు కూడా త‌న‌కు ఇష్టంలేని రాజ‌కీయాలు చేశారు. అయితే, ఇప్పుడు త‌న‌కు ఇష్టం ఉన్న‌.. కోరుకున్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌గా ఉన్నా రు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. అవినాష్ వ్య‌వ‌హారంపై ఆయ‌న వ‌ర్గంలోనే అసంతృప్తి వ్య‌క్త‌మవుతోంది. ఎవ‌రితోనూ క‌ల‌వ‌డం లేద‌ని, సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, ముఖ్యంగా రాజ‌కీయ నేత‌ల‌కు ఉండాల్సిన లౌక్యం ఎంత మాత్ర‌మూలేద‌ని అంటున్నారు.

ఏదైనా స‌రే ప‌ట్టువిడుపులు ఉండాల‌ని, ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఇది చాలా ముఖ్య‌మ‌ని అవినాష్ అనుచ‌రులుగా ఉన్న సీనియ‌ర్లు చెబుతున్నారు. కానీ, స్థానిక ఎన్నిక‌ల్లో త‌ను సూచించిన వారికి అవ‌కాశం ద‌క్క‌లేద‌ని భావించి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సీనియ‌ర్ల‌కు కూడా దూరంగా ఉంటున్నార‌ని అవినాష్ పై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచిప‌రిణామం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాలంటే.. అంద‌రినీ క‌లుపుకొని పోవాలని, కొన్ని ప‌రిణామాలు వ్య‌తిరేకంగా ఉన్న‌ప్ప‌టికీ.. చూసీ చూడ‌న‌ట్టు వెళ్లాల‌ని అంటున్నారు. మ‌రి అవినాష్ త‌న ప‌ద్ధ‌తి మార్చుకుంటారో లేదో చూడాలి.

క‌ల‌వ‌క‌పోతే.. క‌ష్ట‌మే అవినాష్ పాలిటిక్స్‌పై అప్పుడే విమ‌ర్శ‌లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts