నారా లోకేష్‌కు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కౌంట‌ర్‌..!

March 14, 2020 at 5:27 am

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌కు ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ గ‌ట్టి కౌంట‌ర్ ను ఇచ్చాడు. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఘాటుగానే స్పందించారు. రాజ‌కీయ కోణంలో పోలీసు శాఖ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌వ‌ద్దంటూ ఉద్యోధించారు. ఇప్పుడ‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే ఇటీవ‌ల మాచ‌ర్ల‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బుద్ధ వెంక‌న్న‌, బోండా ఉమ‌పై దాడిన జ‌రిగిన విష‌యం తెలిసిందే. దానిపై చిన‌బాబు స్పందిస్తూ పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైసీపీ నేత‌లకు వంత‌పాడుతున్నార‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా స్థానిక సంస్థ‌ల సంద‌ర్భంగా జ‌రుగుతున్న రాజ‌కీయా సంఘ‌ట‌న‌ల‌పై హైకోర్టు కూడా స్పందించింది. రాష్ర్టంలో పోలీసులు ఉన్నారా? అంటూ ప్ర‌శ్నించింది. దీనిని కూడా లోకేష్ త‌న ట్విట్ట‌ర్ ప్ర‌స్తావించారు. తండ్రి ఐఏఎస్‌ల‌ను కేసుల పాలు చేస్తే, కొడుకు ఇప్పుడు ఐపీఎస్‌ల‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

అయితే లోకేష్ పోస్టుపై ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ కాస్త ఘాటుగానే స్పందించారు. పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నార‌ని వివ‌రించారు. మాచార్ల‌లో దాడికి గురైన బుద్ధ వెంక‌న్న‌, బోండా ఉమ‌ను త‌మ పోలీసులే ర‌క్షించి, కాన్వ‌య్‌లో అక్క‌డి నుంచి త‌ర‌లించార‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోవ‌ద్ద‌ని వివ‌రించారు. అదీగాక ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్టు చేశామ‌ని డీజీపీ వెల్ల‌డించారు. అంతేగాక రాజ‌కీయ కోణంలో పోలీసుల‌పై ఆరోప‌ణ‌ల‌కు దిగ‌వ‌ద్ద‌ని చిన‌బాబుకు చుర‌క‌లంటించారు. ఎన్నిక‌ల‌ను పూర్తి శాంతియుతంగా నిర్వ‌ర్తిస్తామ‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. ఈ మేర‌కు డీజీపీ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఇప్పుడ‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డీజీపీ వ్యాఖ్య‌లు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

నారా లోకేష్‌కు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కౌంట‌ర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts