దిశా యాప్‌.. కీచ‌క ఆటోడ్రైవ‌ర్‌కు చెక్‌..

March 5, 2020 at 2:10 pm

వెట‌ర్న‌రీ వైద్యురాలు ధిశా అత్యాచారం.. నిందితుల ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అలాంటి సంఘ‌ట‌న‌లు రాష్ర్టంలో జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఏపీ స‌ర్కారు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం విధిత‌మే. అందులో భాగంగా జిల్లాకో ధిశా పోలీస్ స్టేష‌న్‌ను, ప్ర‌త్యేక న్యాయ‌స్థానాన్ని ఏర్పాటు చేసింది. రేపు కేసు నిందితుల‌కు 21 రోజుల్లోనే శిక్ష ప‌డేలా ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. అన్నింటికీ మించి ఆప‌ద‌లో చిక్కుకున్న మ‌హిళ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు దిశా యాప్‌ను రూపొందించింది. ఇంట‌ర్నెట్ లేక‌పోయినా అది ప‌నిచేసేలా తీర్చిదిద్ద‌డం విశేషం. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉండ‌గా, ఆ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ (SOS) బటన్‌ నొక్కితే చాలు ఫోన్ లొకేషన్ వివరాలతో పాటుగా.. నెంబర్ ఎవరి పేరు మీద ఉంది.? వారి డీటెయిల్స్ ఏంటన్న విషయాలన్నీ పోలీస్ కంట్రోల్‌ రూంకి చేరిపోతాయి. అటు మొబైల్ లొకేషన్‌కు సంబంధించిన 10 సెకన్ల వీడియో, ఆడియో కూడా పోలీసులకు చేరేలా దీనిని సెట్ చేశారు.

ఇదిలా ఉండ‌గా.. ఈ యాప్ ఇప్పుడు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ది. దీని ఆధారంగా ఓ కీచ‌క ఆటోడ్రైవ‌ర్‌కు ముందుగానే చెక్ పెట్టారు అధికారులు. మ‌హిళ‌కు అండ‌గా నిలిచారు. వివ‌రాల్లోకి వెళితే.. ఏపీ రాష్ర్టం కృష్ణాజిల్లా కొల్లేటికోటలో ఓ మహిళ త‌న వ్య‌క్తిగ‌త ప‌ని నిమిత్తం పక్క ఊరికి వెళ్లేందుకు ఓ ఆటోను ఎక్కింది. కొద్దిసేపు వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా ఆ మహిళకు ఆటోడ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడం మొదలైంది. అంతేకాకుండా అతడు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఆమెకు ఇవ్వబోయాడు. దీనితో ఆ మహిళ వెంటనే దిశ యాప్ ఎస్‌ఓ‌ఎస్ ద్వారా పోలీసులకు సమాచారం పంపించింది. అంతే 8 నిమిషాల్లో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆ కీచక ఆటోడ్రైవర్ నుంచి మహిళను కాపాడారు. ఆటోడ్రైవర్ పెద్దిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

దిశా యాప్‌.. కీచ‌క ఆటోడ్రైవ‌ర్‌కు చెక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts